Skip to main content

First Class Admissions : 1వ తరగతిలో ఉచిత ప్రవేశానికి 3వ ఎంపిక జాబితా విడుద‌ల‌..!

1వ తరగతిలో ఉచిత ప్రవేశాల 3వ ఎంపిక జాబితాను రాష్ట్ర అధికారులు విడుదల చేశారు.
Officials discussing the admission process under the Right to Free Compulsory Education Act List of selected students for free admission in private schools  Third merit list released for First class free admissions  State authorities releasing the 3rd choice list of admissions

చిత్తూరు: జిల్లాలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల 3వ ఎంపిక జాబితాను రాష్ట్ర అధికారులు విడుదల చేశారు. ఆ జాబితా ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎంపికైన విద్యార్థులు చేరేందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 28వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన, ఏవైనా సమస్యలు ఉన్న‌ట్లైతే ఈ నెల 29న సంబంధిత ఎంఈఓలకు ఫిర్యాదులు అందజేయాలన్నారు.

Data Entry Course : జులై 6 నుంచి డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సుల్లో శిక్ష‌ణ ప్రారంభం..

అందిన ఫిర్యాదులను సంబంధిత ఎంఈఓలు ఈ నెల 30వ తేదీన డీఈఓకు, డీఈఓలు జూలై 1వ తేదీన రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ ఎస్‌పీడీకి అందజేయాల్సి ఉంటుందన్నారు. అన్నిజిల్లాల నుంచి అందిన ఫిర్యాదులను రాష్ట్ర కార్యాలయంలో జూలై 2న పరిశీలిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియను డీఈఓ, సమగ్రశిక్ష ఏపీసీలు అత్యంత ప్రాధాన్యతగా భావించి పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

B Tech Semester Results : బీటెక్ రెండో సెమిస్ట‌ర్‌ ఫ‌లితాలు విడుద‌ల‌..

Published date : 28 Jun 2024 10:46AM

Photo Stories