Skip to main content

Data Entry Course : జులై 6 నుంచి డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సుల్లో శిక్ష‌ణ ప్రారంభం..

Skill Hub of Paritala Sriramulu Government Degree College  Training by Andhra Pradesh State Skill Development Organization Eligible young men and women Training starting July 6  Training classes in Domestic Data Entry Course from July 6  Training in domestic data entry course

పెనుకొండ: పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్‌ హబ్‌లో జూలై 6వ తేదీ నుంచి డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్‌ కేశవరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివిన యువతీ యువకులు శిక్షణకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గల యువతీ యువకులు కళాశాలలోని స్కిల్‌ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9676706976 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

B Tech Semester Results : బీటెక్ రెండో సెమిస్ట‌ర్‌ ఫ‌లితాలు విడుద‌ల‌..

Published date : 28 Jun 2024 10:36AM

Photo Stories