Education Officers: చనిపోయినా పది మూల్యాంకనానికి రావాల్సిందే...!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: క్యాన్సర్ తో బాధపడుతూ ఓ ఉపాధ్యాయురాలు 2023లో మరణించగా, పది మూల్యాంకనానికి హాజరుకాలే దంటూ ఆమెకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖా అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేయడం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.

కాప్రా మండల పరిధిలోని జవహర్ నగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో గీత స్కూల్ అసిస్టెంట్ గా 2016-2023 మధ్య కాలంలో విధుల్లో ఉన్నారు. 2020లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగానూ ఎంపికయ్యారు. దీర్ఘకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె. 2023 మే నెలలో మరణించారు.

చదవండి: Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

ఒక విద్యా సంవత్సరం గడిచిపోయినా ఆ విషయం గుర్తించలేని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారులు ఆమెకు 10th Class జవాబు పత్రాల మూల్యాంకన విధులు కేటాయించారని, హాజరుకాలేదన్న కారణంతో ఏప్రిల్‌ 4న‌ షోకాజ్ నోటీసు జారీచేసి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

#Tags