SSC Exam Evaluation:ఎస్‌ఎస్‌సీ పరీక్షలు పూర్తి.. స్పాట్‌ వ్యాల్యూవేషన్‌కి తేదీ..!

ముగిసిన పదో తరగతి పరీక్షలకు ముల్యాంకనం తేదీని వెల్లడించారు డీఈఓ సోమశేఖర్‌ శర్మ. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను వివరించారు..

ఖమ్మం సహకారనగర్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగిశాయి. చివరి రోజు పరీక్షకు 16,609 మంది విద్యార్థుల్లో 16,559 మంది హాజరుకాగా, 50 మంది గైర్హాజరయ్యారు. కాగా, పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి ఈ. సోమశేఖరశర్మ తెలిపారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు, కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై అధికారులతో తరచుగా సమీక్షించిన కలెక్టర్‌ గౌతమ్‌.. రోజూ ఒకటి, రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఇక విద్యాశాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పి.మదన్‌మోహన్‌ను పరీక్షల పరిశీలకుడిగా నియమించడంతో ఆయన అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరీక్షలు ప్రశాంతంగా ముగిసేలా పర్యవేక్షించారు.

Central Schools: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు

3 నుంచి స్పాట్‌ వాల్యూయేషన్‌

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుకానుంది. ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో క్యాంపు ఏర్పాటు చేస్తుండగా, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

AP Schemes: అమ్మ ఒడి వచ్చాకే పిల్లల చదువులు..

#Tags