Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం .......

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం .......
Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం .......

ఆదిలాబాద్‌: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ పాఠశాలలో స్పాట్‌ను ఏర్పాటు చేశారు. తొలిరోజు మూల్యాంకనం ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్కో ఉపాధ్యాయుడికి 20 జవాబు పత్రాలు దిద్దేందుకు ఇచ్చారు. 794 మంది ఉపాధ్యాయులకు విధులు కేటాయించగా, 578 మంది మాత్రమే విధుల్లో చేరారు. వీరిలో 76 మంది సీఈలు, 452 మంది ఏఈలు, 50 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాకు మూల్యాంకనం కోసం 1లక్ష 90వేల జవాబు పత్రాలు వచ్చాయని డీఈవో ప్రణీత తెలిపారు. అయితే బయోసైన్స్‌, సాంఘిక శాస్త్రం, స్పెషల్‌ అసిస్టెంట్ల కొరత ఉందని పేర్కొన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల డీఈవోలను ఆదిలాబాద్‌ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు చేసే ఉపాధ్యాయులు ఉంటే వారికి ఆదిలాబాద్‌లో మూల్యాంకన విధులు కేటా యించాలని కోరారు. కుమురంభీం జిల్లాకు చెందిన పలువురు మూల్యాంకనం చేసేందుకు విధుల్లో చేరినట్లు డీఈవో తెలిపారు.

జోరుగా పైరవీలు..

మూల్యాంకన విధుల నుంచి తప్పించుకునేందుకు కొంత మంది ఉపాధ్యాయులు ఆయా ఉపాధ్యాయ సంఘాల నుంచి పైరవీ చేయించారు. కుప్పలు తెప్పలుగా వినతులు అందించారు. తమ సంఘానికి చెందిన ఉపాధ్యాయులకు స్పాట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి నట్లు కనిపించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వగా, కొంత మంది వివాహాలు, ఇతర కారణాలు చూపుతూ స్పాట్‌కు డుమ్మా కొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో మూల్యాంకనం గడువులోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. 182 మంది స్పెషల్‌ అసిస్టెంట్లకు విధులు కేటాయించగా, కేవలం 50 వరకు మాత్రమే విధుల్లో చేరారు. వీరిలో కొందరు ఎన్ని కల శిక్షణకు వెళ్లగా, మరికొంత మంది కావాలనే డుమ్మా కొట్టినట్లు సమాచారం. బయోసైన్స్‌, సాంఘిక శాస్త్రంలో కొరత ఉందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Telangana 10th Results 2024 Release Date

 

#Tags