Skip to main content

JEE Advanced Admit Card: జేఈఈ అడ్వాన్డ్స్ 2024 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

JEE Advanced Admit Card

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. విద్యార్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈనెల 26న JEE (Advanced) పరీక్షను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్-2 పరీక్ష 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది.

CUET UG 2024 Revised Admit Card: సీయూఈటీ-యూజీ పరీక్షలు రాస్తున్న వారికి అలర్ట్‌.. ఎగ్జామ్‌ సెంటర్స్‌లో మార్పులు

ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మకమైన 23 ఐఐటీల్లో, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో బీటెక్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారన్న విషయం తెలిసిందే. 

JEE (Advanced) Admit Card.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ jeeadv.ac.in ను క్లిక్‌ చేయండి. 
  • హోం పేజీలో కనిపిస్తున్న జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024 అడ్మిట్ కార్డు లింక్‌ను క్లిక్‌ చేయండి. 
  • లాగిన్‌ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది..
  • తదుపరి అవసరాల కోసం డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి. 
     
Published date : 17 May 2024 01:17PM

Photo Stories