10th class: పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి

కెరమెరి(ఆసిఫాబాద్‌): విద్యాశాఖ అమలు చేస్తున్న లక్ష్య కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి, పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఇన్‌చార్జి డీఈవో ఉదయ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి బోధన తీరు ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయుల లెస్సన్‌ ప్లాన్‌, మంత్లీ, యూనిట్‌ ప్లాన్‌, డైరీలను పరి శీలించారు. ప్రతిరోజూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట కాంప్లెక్స్‌ హెచ్‌ఎం చంద్రశేఖర్‌ ఉన్నారు.

చ‌ద‌వండి: TS 10th Class TM Study Material

#Tags