Collector Rajarshi Shah: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం..

మెదక్‌ కలెక్టరేట్‌: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పదో తరగతి విద్యార్థుల వంద శాతం ఉత్తీర్ణతపై ప్రధానోపాధ్యాయులతో కలిసి ఆయన సమీక్షించారు. ప్రతి పాఠశాలలో లక్ష్య కార్యక్రమంలో భాగంగా పర్మాఫర్స్‌ – పీర్‌ గ్రూప్‌ లెర్నర్స్‌ – టీచర్‌ అసిస్టెంట్‌ లెర్నర్స్‌ పేరిట మూడు గ్రూప్‌లుగా విభజించుకొని వ్యూహాత్మకమైన బోధన సాగించాలన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడూ సూచనలు ఇవ్వాలని తెలిపారు. అనంతరం డీఈఓ రాధాకిషన్‌ మాట్లాడుతూ నవంబర్‌ 1 నుంచి రోజూ 2 గంటలపాటు ప్రత్యేక పునశ్చరణ తరగతులు కొనసాగుతున్నాయన్నారు. తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనబరచిన ఉపాధ్యాయుల తరగతి కార్యకలాపాలపై సంకలనం చేసిన పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ విషయంలో చొరవ చూపిన తూప్రాన్‌ మండల నోడల్‌ అధికారి సత్యనారాయణను అభినందించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్‌ అధికారి శంకర్‌నాయక్‌, మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి జమ్లా నాయక్‌, డీఎఫ్‌ఓ రవి ప్రసాద్‌, డీఏఓ గోవింద్‌, సీపీఓ కృష్ణయ్య, ఏఎంఓ సుదర్శనమూర్తి, ఎంఈఓలు నీలకంఠం, బుచ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: TS 10th Class TM Study Material

#Tags