AP DSC Notification 2023 : ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్‌..? పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జులై 11వ తేదీ(మంగ‌ళ‌వారం) తెలిపారు.
Botsa Satyanarayana

ఆగస్టులో డీఎస్సీ ప్రకటన ఉండే అవకాశముందన్నారు. అలాగే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రకటన కోసం సీఎం కసరత్తు చేస్తున్నారని మంత్రి బొత్స వెల్లడించారు.

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఖాళీగా ఉన్న పో­స్టుల భర్తీకి..
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్‌ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టు­లు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తు­­న్నామన్నారు. నివేదికను సీఎంకు వివరించి ఆ­య­న తదుపరి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పో­స్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

☛ Central Government Teaching Jobs 2023 : కేంద్ర విద్యాశాఖలో 58 వేల ఉద్యోగాలు.. ఖాళీల పూర్తి వివ‌రాలు ఇవే.. త్వ‌ర‌లోనే..

#Tags