NEET Achiever: 20 ఏళ్ళ వయసులోనే నీట్‌ క్లియర్‌.. ఇది జరిగింది

11 ఏళ్ళ వయసులో వివాహం జరిగప్పట్టికీ, తన చదువు ఏమాత్రం ఆగదు అని నిర్ణయించుకున్నాడు. విడుదలైన నీట్‌ ఫలితాల్లో, మంచి మార్కులతో అనుకున్న దారిలో నడుస్తున్నాడు రాంలాల్‌..

విడుదలైన నీట్‌ ఫలితాల్లో, మంచి మార్కులతో అనుకున్న దారిలో నడుస్తున్నాడు రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని ఘోసుండా నివాసి రాంలాల్‌. ఇతనికి 11 ఏళ్ళ వయసులోనే వివాహం జరిగింది. 20 ఏళ్ళ వయసులో సంతానం కలిగింది. అయినప్పటికీ నీట్‌కు ప్రయత్నాన్ని వీడలేదు. 20 ఏళ్ళ వయసులో కూడా నీట్‌కి ప్రయత్నించారు. చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరారు. ఇక తన ప్రయాణం గురించి మరింత వివరాలను తెలుసుకుందాం..

All India Topper: నీట్‌ పరీక్షలో ఆలిండియా టాపర్‌గా.. నిర్వహించుకున్న వ్యూహం ఇదే..!

11 ఏళ్ళ వయసులో వివాహం జరిగప్పట్టికీ, తన చదువు ఏమాత్రం ఆగదు అని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయానికి తన తండ్రి మొదట అడ్డ పడ్డప్పటికీ నెమ్మదిగా తానే సాయం చేస్తానని తెలిపారు. తన తండ్రితోపాటు, 10వ తరగతి వరకు చదివిన తన భార్య కూడా ముందు ఒప్పుకోలేదు కాని, తన భర్త చదువు గొప్పతనం చూసిన అనంతరం తాను కూడా మద్దతు ఇస్తానని తెలిపింది. ఇలా తన చదువుకు అడ్డు తొలగడంతో మరింత ఉత్సాహంతో చదివి 4 సార్లు ప్రయత్నాన్ని వీడకుండా చదివాడు.

Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

చదువు ప్రయాణం..

వివాహం జరిగిన వయసులో రాంలాల్‌ 6వ తరగతి చదువుతున్నారు. బాల్య వివాహం అయినప్పటికీ, చదువును వీడనని స్పష్టం చేశారు రాంలాల్‌. ఈ నేపథ్యంలోనే తన డాక్టర్‌ చదువును 10వ తరగతి అనంతరం 11 12వ తరగతుల్లో తాను అతను సైన్స్ స్ట్రీమ్‌లో పాల్గొనడానికి NEET UG పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించాడు. మొదటి ప్రయత్నంలో తనకు తానుగానే సిద్ధమవుతూ చదివి 350 మార్కులు సాధించారు. ఇది తన 12వ తరగతి చదువుతున్నప్పుడు చేసి ప్రయత్నం. అలా మరో రెండుసార్లు ప్రయత్నించారు. పలు మార్కుల తేడా లభించింది.

AP SI Job Selected Candidate Success Story : ఎస్ఐ ఫ‌లితాల్లో.. రాయలసీమ జోన్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

ఇలా సంవత్సరానికి ఒక ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న మార్కులు దక్కలేదు. రాంలాల్, సహనాన్ని వీడకుండా మళ్ళీ ప్రయంతంగా.. ALLEN కోటాలో అడ్మిషన్ కోరాడు, అక్కడ ఉపాధ్యాయులు నిపుణులు అతనికి NEET UG పరీక్ష కోసం సిద్ధం చేయడంలో సహాయం చేసారు. ప్రయత్నాన్ని ఆరంభించారు. మొత్తానికి, రాంలాల్‌ నీట్‌ పరీక్షలో 490 మార్కులను సాధించారు. ఈ మార్కులతో తన డాక్టర్‌ అవ్వాలనే కలను సాకారం చేసుకోగలరని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్నా తన కుటుంబం అంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

#Tags