Government Jobs: వావ్.. మూడేళ్లలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు!!
చాలా మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలు కష్ట పడి చదివినా ఏ ఉద్యోగం రావడం లేదు.. అటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు.
అలాగే ఇటీవల విడుదలైన 12th ఫెయిల్ సినిమాలో ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ ఉద్యోగం సాధించిన మనోజ్ శర్మ గురించి మనకు తెలిసిందే.. అదే సినిమాలో ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాకపోవడంతో కోచింగ్ ఇచ్చిన వ్యక్తి కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం కష్టమైనా ప్రయత్నం చేస్తూనే ఉండాలని తెలుసుకోండి.. ఈ స్టోరీ వివరాల్లోకి వస్తే..
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన రమావత్ మధుసూదన్ 3 సంవత్సరాల వ్యవధిలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల విడుదలైన ఐబీపీఎస్ ఫలితాల్లో పీవో కేడర్‌లో కెనరాబ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాడు.
Kalpana Birda: గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు!!
మధుసూదన్ సాధించిన ఉద్యోగాలు ఇవే..
➤ మధుసూదన్ ఇప్పటివరకు ఐబీపీఎస్, ఎస్‌బీఐ, ఆర్‌ఆర్‌బీ, ఎల్‌ఐసీ, ఎన్‌ఐఏసీఎల్, ఎఫ్‌సీఐ, ఐడీబీఐ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, టీఎస్ క్యాబ్ వంటి సంస్థలలో ఉద్యోగాలు సాధించాడు.
➤ ఇంతకు ముందు ఎస్‌బీఐ పీవోగా కర్ణాటకలో ఎంపికవ్వడంతో చేరిన ఈయన తెలంగాణలో గ్రూప్ నోటిఫికేషన్లు విడుదల కావడంతో.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
➤ ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (సీజీఎల్)లో ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నాడు.
ప్రేరణ & మద్దతు:
➤ మధుసూదన్ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది.
➤ తల్లి ప్రోత్సాహం తన విజయానికి ముఖ్య కారణమని మధుసూదన్ అన్నాడు.
విజయం కోసం ఆయన కృషి ఇదే..
➤ బీటెక్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించడం మొదలుపెట్టాడు.
➤ ఒక సంవత్సరం పాటు బ్యాంకు ఉద్యోగం కోసం కష్టపడ్డాడు.
➤ తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయినా, కుంగిపోకుండా ప్రయత్నాలు కొనసాగించాడు.
➤ కోచింగ్ సెంటర్లో చేరి, నిరంతరం పరీక్షలు రాస్తూ, సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాడు.