IAS Officer Success Story: ఇలాంటి పనులు చేస్తూ చదివా.. ఎట్టకేలకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానిలా.. కానీ..
సాక్షి ఎడ్యుకేషన్: యూపీఎస్‌సీలో రాణించేందుకు ఎంతో కృషి, పట్టుదల కావాలి. అందులో సివిల్స్ సర్వీసెస్ అంటే, దేశంలోనే అతిపెద్ద పరీక్ష ఇది. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్, ఐఏఎస్, పోలీసులు, తదితర అభ్యర్థులంతా ఈ పరీక్షలు రాసి గొప్ప ర్యాంకులను సాధించినవారే. అందరూ కష్టపడతారు, కొందరు కోచింగ్ తీసుకొని ముందుకు వెళతారు, మరికొందరు తమకు తామే పరీక్షకు సిద్ధపడతారు.
అయితే, వీరందరిలో కన్నా వేరుగా లక్ష్యాన్ని సాధించన వ్యక్తి ఇతను ఒక్కరే.. ఐఏఎస్ ఆఫీసర్ బీ. అబ్దుల్ నసర్. ఎప్పుడు, ఇతను ఎలా తన ప్రయాణాన్ని ప్రారంభించి పరీక్షలు లేకుండానే తన లక్ష్యాన్ని చేరుకున్నారో తెలుసుకుందాం. ఈ కథనంతో ఐఏఎస్ అబ్దుల్ నసర్ విజయానికి కారణాన్ని తెలుసుకుందాం..
కేరళా రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో ఉన్న తలస్సేరి అనే గ్రామంలోనివారు బి. అబ్దుల్ నసర్. తాను పుట్టిన ఐదు సంవత్సరాలకే తండ్రిని కోల్పోవడంతో తన సోదరి సోదరులతోపాటు అనాధ ఆశ్రమంలో నివసించేవారు. అయితే, వారి తల్లి తన కుటుంబానికి సహకారంగా నిలిచేందుకు ఇతర ఇంట్లల్లో పని చేసేది. ఎన్నో ఇబ్బందులను ఎదురుకొని చదువు ప్రయాణాన్ని కొనసాగించారు నసర్. పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు కేరళ ఆశ్రమంలో నివసిస్తూనే చిన్న చిన్న పనులకు వెళ్లి కుటుంబానికి సహాయపడేవారు.
అలా కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ ఆశ్రమంలోనే గడిపి చదువుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టపడి చదవాలనే పట్టుదల తగ్గలేదు నసర్‌కు. కొన్ని సంవత్సరాల తరువాత తన గ్రాడ్యువేషన్‌ను తలస్సేరి ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసుకున్నారు. అనంతరం, తన కుటుంబం కొసం నిలబడేందుకు ఎన్నో రకాల ఉద్యోగాలు కూడా చేశారు. ఇంటింటికీ పేపర్లను చేరవేయడం, విద్యార్థులకు చదువు చెప్పడం వంటి రకరకాల పనులతో వచ్చే డబ్బులను తన కుటుంబానికే ఇచ్చేవాడు.
నసర్.. తన పోస్ట్ గ్రాజ్యువేట్ పూర్తి చేసుకుని కేరళా ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరి తన జీవితాన్ని ప్రారంభించారు. యూపీఎస్‌సీ సాధించాలనే ఆశతో ఉన్న ఇతను 1994లోనే ఈ ఉద్యోగం సాధించడంతో కొన్ని సంవత్సరాల్లోనే పదోన్నతలు అతన్ని వెంటాడాయి. అయితే, తన కష్టం, పట్టుదల, చదువు సరకారంతో 2006లో రాష్ట్ర సివిల్ సర్వీస్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పేరొందారు.
ఈ విజయం సాధించిన కొన్ని సంవత్సరాలకు అంటె దాదాపు 10 సంవత్సరాల తరువాత (2015) నసర్ కేరళాలోనే టాప్ డిప్యుటీ కలెక్టర్‌గా విజయం దక్కించుకున్నారు. మరో రెండేళ్లు అంటే, 2017లో ఐఏఎస్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. 2019లో జిల్లా కలెక్టర్ కంటే ముందు కేరళా ప్రభుత్వానికి హౌసింగ్ కమిషనర్‌గా చేశారు.
ఎన్నో కష్టాలతో ముందుకు నడుస్తూ యూపీఎస్‌సీ సాధించాలనే తపన ఉన్న వారందరికీ ఇతని ప్రయాణం ఒక స్పూర్తిదాయకం. జీవితంలో ఎంత కృషి, పట్టుదల ఉంటే వ్యక్తులు అంత ఎత్తుకు ఎదుగుతారు అనేందుకు అబ్దుల్ నసర్ నిదర్శనం. ఇతని గెలుపు ఇతరులకు ఎంతో ప్రేరేపించే కథగా నిలిచింది.
Tags
- Success Story
- upsc success stories
- inspiring stories of ias officers
- Ias Officer Success Story
- IAS B Abdul Nassar
- inspiring and motivational journey
- education struggles
- IAS journey
- struggles in success journey
- IAS Officer
- Top Deputy Collector in Kerala
- promotions
- housing commissioner for kerala government
- Education News
- Sakshi Education News
- latest success stories
- most inspiring stories of ias and ips officers
- IAS officers of kerala
- upsc rankers
- Civil Services Success
- top rankers for upsc exams