Higher education: ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యావకాశాలు

ఏఎన్‌యూ: ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలున్నాయని ఫ్రాన్స్‌ అంబాసిడర్‌ మెర్రిన్‌ రైఖాన్‌ తెలిపారు.

ఆయన బుధవా రం నాగార్జున యూనివర్సిటీని సందర్శించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎన్‌యూ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంటు కోర్సులలో చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తున్నామని తెలిపారు. అనంతరం వీసీ ఆచార్య పి. రాజశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎన్‌యూ, ఫ్రాన్స్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫ్రాన్స్‌తో ఏఎన్‌యూ ఎంఓయూ కుదుర్చుకునే అంశాలపై ప్రాథమిక చర్చలు జరిగారు. దీని ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు రెండు దేశాల విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడం, పరిశోధనలు చేసుకునే అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకు ఉన్నత విద్యకు వెళుతున్న సందర్భంలో ఫ్రాన్స్‌లో ఉన్న అవకాశాలను రైఖాన్‌ వివరించారు. ఏఎన్‌యూ ఆన్‌లైన్‌ విధానంలో బోధిస్తున్న ఫ్రెంచ్‌ భాషను విద్యార్థులు నేర్చుకుని అవగాహన పెంచుకోవాలని రైఖాన్‌ సూచించారు. రాబోయే రోజుల్లో భారత్‌కు ఫ్రాన్స్‌ విద్యా , పరిశోధన అంశాలలో మంచి భాగస్వామిగా నిలుస్తుందని ఆమె తెలిపారు. చర్చల్లో రెక్టార్‌ ఆచార్య పి. వరప్రసాద మూర్తి, రిజిస్ట్రార్‌ ఆచార్య బి. కరుణ, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి. చెన్నారెడ్డి పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ విశ్వవిద్యాలయాలతో ఏఎన్‌యూ ఎంఓయూ కుదు ర్చుకునే అంశాలను అధ్యయనం చేయాలని యూనివర్సిటీ అధికారులకు వీసీ సూచించారు.

చదవండి: Student Visa Latest Rules: స్టూడెంట్‌ వీసాలపై పలు దేశాల ఆంక్షలు.. కొత్త నిబంధనలు ఇవే..

#Tags