Indian envoy Sanjay Verma: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి తెలిస్తే.. సంజీవ్‌కుమార్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

కెనడాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత హైకమిషనర్‌ సంజీవ్‌కుమార్‌ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు సరైన ఉద్యోగ అవకాశాలు పొందడం లేదని, అందువల్ల కెనడాకు వెళ్లాలనుకునే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ''పైచదువుల కోసం కెనడాకు వెళ్తున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధిక భాగం భారతీయ విద్యార్థులే ఉన్నారు. వారి తల్లిదండ్రులు తమ ఆస్తులు అమ్మి, బ్యాంకు లోనులు తీసుకొని మరీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశాలకు పంపిస్తుంటారు. అయితే ఇప్పుడు కెనడాలో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి.

మెడిసిన్‌ చదివి క్యాబ్‌ డ్రైవర్లుగా..

మెడిసిన్‌ వంటి డిగ్రీలు పూర్తి చేసిన వారికి కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లేక ట్యాక్సీ డ్రైవర్లుగా, షాపుల్లో, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే క్లాసులు నిర్వహించే కళాశాలలు కెనడాలో చాలానే ఉన్నాయి.దీంతోవారి చదువులు కూడా దానికి తగ్గట్లే ఉంటాయి. కాలేజీల్లో చేర్పించేముందు ఒకటికి రెండుసార్లు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే మీ పిల్లలను పంపించండి.

KGBV Merit List Released: కేజీబీవీకి ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల

విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమిదే

చదువులు సరిగ్గా లేక ఉద్యోగం లేక నెలవారీ ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఒక్క గదిలో ఎనిమిది మంది నిద్రపోతున్నారు. ఇది వారి ఆరోగ్యానికే కాదు, వారి చదువులకు కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఫలితంగా తీర్చిన అప్పులు కట్టలేక, తిరిగి ఇండియాకు రాలేక చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే పిల్లలను కెనడాకు పంపేముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి'' అంటూ ఆయన పేర్కొన్నారు.

కాగా ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య నేపథ్యంలో భారత్‌, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత హైకమిషనర్‌ సంజీవ్‌కుమార్‌ వర్మ వ్యాఖ్యలు విద్యార్థుల సంక్షేమం, చదువుల నాణ్యతపై మరిన్ని సందేహాలను రేకెత్తిస్తున్నాయి. 
 

#Tags