Students: విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
Sakshi Education
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోను ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జ్ఞానేశ్వర్ కోరారు.
అక్టోబర్ 16న చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకు తొందరపడి మానసికంగా కుంగిపోవద్దన్నారు. ఎలాంటి సమస్యలున్నా స్నేహితులతో పంచుకోవాలన్నారు. మానసికంగా దృఢంగా ఉండాలని, ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు.
చదవండి: DSC 2024: చదివిన బడిలోకే సారుగా ఉద్యోగం: పుర్రె రమేశ్
మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించగలరన్నారు. అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. చక్కటి ప్రణాళికతో చదువుకొని ఉజ్వల భవిష్యత్ వైపు వెళ్లేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు, ప్రిన్సిపాల్ శశిధర్, అధ్యాపకులు ఉన్నారు.
Published date : 18 Oct 2024 09:55AM