Skip to main content

Show Cause Notice : ఈ విద్యా సంస్థ‌కు షోకాజ్ నోటీస్‌.. కార‌ణం!

Show cause for narayana educational institution  Narayana Vidya Sansthan school in Aakiveedu and Bhimavaram under inspection  Deputy Education Officer N. Srinivasa Rao giving a show cause notice to Narayana Vidya Sansthan

ఆకివీడు: సెలవు దినాల్లో పాఠశాలలు తెరవవద్దని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో ఆకివీడు, భీమవరంలోని నారాయణ విద్యా సంస్థకు షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లు ఉప విద్యా శాఖాధికారి ఎన్‌.శ్రీనివాసరావు చెప్పారు. ఏబీవీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా విద్యా సంస్థల్ని డీవైఈఓ ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులు స్కూల్‌లో ఉండటాన్ని గుర్తించిన డీవైఈఓ ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు. అనంతరం షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

Archery World Cup: ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఐదోసారి దీపిక కుమారికి రజతం

ఈ విషయాన్ని జిల్లా విద్యా శాఖాధికారిణి నాగమణికి తెలియజేసినట్లు వివరించారు. ఏబీవీపీ నియోజకవర్గ విభాగ్‌ కన్వీనర్‌ ఈశ్వర్‌ సాయి మాట్లాడుతూ గత నాలుగైదు పర్యాయాలు ఆయా విద్యా సంస్థలు సెలవు దినాల్లో తెరిచిన విషయాన్ని విద్యా శాఖ అధికారులకు తెలియజేశామన్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే సెలవుల్లో పాఠశాలలు నడుపుతున్నారని, సెలవు దినాల్లో విద్యా సంస్థలు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Oct 2024 08:25AM

Photo Stories