Telangana Teachers : ఈ ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్.. 12 నెలల జీతంతో పాటు ఆరు నెలల సెలవులు.. అలాగే క్రమబద్దీకరణ కూడా..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించినట్టుగానే గురుకుల ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను జారీ చేసింది.
☛ 6,612 పోస్టులకు నోటిఫికేషన్.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. కాంట్రాక్ట్ టీచర్లలను..
12 నెలల జీతంతో పాటు ఆరు నెలల సెలవులను కూడా..
సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించింది ప్రభుత్వం. సాంఘిక గురుకుల ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
పీఆర్సీని కూడా..
2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించింది. అందులో స్టాఫ్ నర్సులతోపాటు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. అయితే, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేసినప్పటికీ వారికి పూర్తి స్థాయిలో వేతనాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
☛ ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
☛ TS TET 2023: టెట్ షెడ్యూల్... పరీక్ష విధానం.. అర్హత మార్కులు ఇలా..
☛ చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | 2022 ప్రివియస్ పేపర్స్
☛ TS TET 2022 Paper-1 Question Paper & Key
☛ TS TET 2022 Paper-2 Final Key: టీఎస్ టెట్ పేపర్-2 ఫైనల్ 'కీ' విడుదల.. ఈ సారి మాత్రం..