Kalpana Birda: గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు!!

ఏ వ్య‌క్తి అయినా ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎన్నో సంవ‌త్స‌రాలు కష్ట ప‌డి చ‌దివినా ఉద్యోగం వ‌స్తుందో రాదో తెలియ‌దు.

కానీ గ్రామీణ ప్రాంత యువతులు  ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో ఓ యువ‌తి కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఆమె గురించి తెలుసుకుందాం.. 

రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి(సీహెచ్‌ఎస్‌ఎల్‌)లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్‌టీలో ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం చేజిక్కించుకుంది.

కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. 

Seven Police Sisters Inspirational Story : ఎన్నో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొని.. ఈ ఏడుగురు ఆడపిల్లలు.. పోలీసు ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

కల్పన పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకుంది. ఆ తర్వాత ఇంట్లోనే చదువుకుంది. చదువుతో పాటు నిరంతర రివిజన్
చేసుకునేది.  సానుకూల దృక్పథం కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించాన‌ని ఆమె తెలిపింది. ఈమె సాధించిన ఘనత చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. 

కల్పన సందేశం..
➤ గ్రామీణ యువతులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించగలరు
➤ కష్టపడితే ఏదైనా సాధ్యమే..
➤ లక్ష్యాలను వదలకండి..

కల్పన విజయం యువతకు ఒక పాఠం..
➤ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంత కష్టం కాదు.
➤ కృషి, కృషి, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే.
➤ లక్ష్యాలను నిర్దేశించుకోండి, వాటిని వదలకండి.
➤ గ్రామీణ యువతులు కూడా రాణించగలరు.

Radhamani Amma: వ‌య‌సు 71 ఏళ్లు.. 11 హెవీ వాహనాల లైసెన్స్‌లతో న‌డుపుతోంది రికార్డ్‌ల చక్రం!!

#Tags