AP Medical Jobs Notification 2022 : వైద్యారోగ్యశాఖలోని 957 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యశాఖలో 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి డిసెంబ‌ర్ 2వ తేదీన‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
AP Staff Nurse Notification 2022

ఈ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ పద్దతిన భ‌ర్తీ చేయ‌నున్నారు.

➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ :
ఈ పోస్టులకు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తును స్వీకరించనున్నారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తును డిసెంబర్ 9లోగా ఆయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాలి.

AP Police Jobs 2022 Notification PDF : 6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

భ‌ర్తీ ప్ర‌క్రియ ఇలా..

ఈ ఉద్యోగాల‌ను మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా భర్తీ  చేయ‌నున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను డిసెంబ‌ర్ 19వ తేదీన తీస్తారు. అనంతరం, 20వ తేదీన సెలక్షన్‌ లిస్ట్‌ను తీసి.. డిసెంబర్‌ 21, 22వ తేదీల్లో కౌన్సిలింగ్‌, అపాంట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

➤ Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

➤ Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ

రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల చిరునామాలు ఇవే..

☛ విశాఖపట్నం ఆర్డీ కార్యాలయం: రీజనల్ డైరెక్టర్, బుల్లయ్య కాలేజీ ఎదురుగా, రేసపువానిపాలెం

☛ రాజమండ్రి ఆర్డీ కార్యాలయం: జిల్లా ఆసుపత్రి ప్రాంగణం , రాజమండ్రి

☛ గుంటూరు ఆర్డీ కార్యాలయం: పాత ఇటుకులబట్టి రోడ్ , అశ్విని ఆసుపత్రి వెనుక, గుంటూరు

☛ వైఎస్సార్ కడప ఆర్డీ కార్యాలయం: పాత రిమ్స్ ప్రాంగణం, కడప

☛ జోన్ల వారీగా ఖాళీల వివరాల కోసం https://cfw.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. 

పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags