AP Government Jobs Notifications 2024 : నిరుద్యోగులకు ఏపీ సీఎం సంక్రాంతి కానుక ఇదే.. త్వ‌ర‌లోనే భారీగా ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు శుభ‌వార్త మీ శుభ‌వార్త చెప్పుతుంది. ఇటీవ‌లే ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌-1& 2 ఉద్యోగాల‌తో పాటు ఇత‌ర నోటిఫికేష‌న్లు వ‌రుస‌గా ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరు­ద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది.

పండుగ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన మీడి­యాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానా­లను త్వరలో ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్‌ ఎన్నికలకు ముందు ఏ హామీలిచ్చారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలుచేశారని ఆయన గుర్తుచేశారు. 

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలుచేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. మహానేత వైఎస్సార్‌ హయాంలో ఏపీ అభివృద్ధి బాటపడితే.. ఇప్పుడాయన తనయుడు జగన్‌ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం ఏపీలో జరిగిందన్నారు.

వీటి ఆధారంగానే ప్రభుత్వం నోటిఫికేషన్‌.. 

మరోవైపు.. అన్ని జిల్లాల్లోను వివిధ మేనేజ్‌మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడునెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేసి, వివరాలు సేకరించింది. డైరెక్ట్‌ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్‌ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్‌ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి, ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుండటంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల  ఎదురుచూపులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ఎంతో ఊరటనిచ్చిందన్నారు.

#Tags