AP Endowments Department Jobs : నెల‌కు రూ.35,000 జీతంతో.. దేవాదాయ శాఖలో వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ‌, కాంటాక్ట్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఇస్తున్న విష‌యం తెల్సిందే. ఇటీవ‌లే గ్రూప్‌-1& 2 ఉద్యోగాలు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అలాగే ఇటీవ‌లే కాంటాక్ట్ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 35 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగాల‌కు,  05 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)పోస్టులకు... అలాగే.. 30 టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం దేవాదాయ శాఖలో 70 పోస్టుల భ‌ర్తీ నోటిఫికేష‌న్ ఇచ్చింది.

చదవండి: APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్‌ రాసుకుని.. గుర్తు పెట్టుకోవ‌డం ఎలా..?

చదవండి: APPSC Group 1 & 2 Success Tips : గ్రూప్ 1 & 2 సిల‌బ‌స్‌పై ప‌ట్టు ప‌ట్టండిలా.. ఉద్యోగం కొట్టండిలా..

అర్హ‌త‌లు- జీతం ఇలా..
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయోపరిమితి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వయోపరిమితి అయిదేళ్ల సడలింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సుతో జీతం చెల్లిస్తారు.రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ.500వ‌ర‌కు ఉంటుంది.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
www.aptemples.ap.gov.in/en-in/home వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జ‌న‌వ‌రి 05, 2024.

ఈ ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags