APPSC Group 1 & 2 Success Tips : గ్రూప్ 1 & 2 సిలబస్‌పై పట్టు పట్టండిలా.. ఉద్యోగం కొట్టండిలా..
కఠినమైన సబ్జెక్టును.. ఈజీగానే..
ప్రతి వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు సహజమని, సమస్య వచ్చిందని, కష్టమని పోరాటం నిలిపేస్తే అక్కడికే జీవితం ముగుస్తుందని బాలలత అన్నారు. గ్రూప్స్ సన్నద్ధం అయ్యే వారు ముందుగా సిలబస్‌పై అవగహన పెంచుకోవాలన్నారు. ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది? ఏఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి? కఠినమైన సబ్జెక్టును ఏ సమయంలో చదవాలి? అనే అంశాలపై ఓ ప్రణాళిక వేసుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నల సరళి తెలుసుకునేందుకు పాత ప్రశ్న పేపర్లను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని సూచించారు.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
కరెంట్ ఆఫైర్స్‌తో సబ్జెక్టును కలుపుకుని..
చాలా మంది పరీక్షలకు ప్రిపరేషన్ అయ్యాక ప్రాక్టీస్ మొదలు పెడతారని, అలా చేస్తే సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి రోజు కనీసం 50 బిట్లు అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నారు. తరుచుగా న్యూస్ పేపర్లు చదువుతూ కరెంట్ ఆఫైర్స్‌తో సబ్జెక్టును కలుపుకుని విశ్లేషణాత్మకంగా సన్నద్ధం కావాలన్నారు. పరీక్షల సమయంలో ఆత్మస్థైర్యం తగ్గకుండా స్ఫూర్తిదాయకమైన అంశాలను గుర్తుకు తెచ్చుకుంటూ చదవాలన్నారు.
Tags
- APPSC
- appsc group 1 success plan
- appsc group 2 success plan
- appsc group 2 exam pattern
- appsc group 2 tips in telugu
- appsc group 1 tips in telugu
- balalatha madam
- APPSC Group 2 Success Tips in Telugu
- appsc group 1 best tips
- appsc group 2 best tips
- appsc group 2 new exam pattern telugu
- appsc group 2 success strategies
- Exam Preparation Tips
- Success Stories
- International Affairs
- sakshi education groups material
- sakshi education videos