Ispirational Success Story : ఒకే వ్యక్తి మూడు ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు కొట్టాడిలా.. కానీ..

ప్ర‌స్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో.. ఒక ఉద్యోగం కొట్టితే చాలు.. లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటాం. అది ప్ర‌భుత్వ ఉద్యోగం అయితే.. మ‌న ఆనందంకు అవ‌ధులు ఉండ‌వ్.

కానీ తెలంగాణ‌లోని దండేపల్లి మండలంకు చెందిన పెండ్యాల సాయికిరణ్ మాత్రం.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించి.. ఔరా అనిపించేలా చేశాడు. ఈ నేప‌థ్యంలో సాయికిరణ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
తెలంగాణ‌లోని దండేపల్లి మండల కేంద్రానికి చెందిన వారు పెండ్యాల సాయికిరణ్. ఈయ‌న తండ్రి సత్యనారాయణ. త‌ల్లి శకుంతల.

☛➤ UPSC IFS 2023 Topper Ritvika Pandey : ఫెయిల్ అయ్యా.. కానీ ఐఎఫ్ఎస్‌లో ఫస్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఆ కోరికతోనే..

ఎడ్యుకేష‌న్ : 
సాయికిరణ్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, మహారాష్ట్రలోని దపోలీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేశాడు. 

మూడు ఉద్యోగాలను సాధించాడిలా..
సాయికిరణ్.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ.. గ్రూప్‌–4, ఇండియన్‌బ్యాంక్, మండల వ్యవసాయ అధికారి ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. ఇందులో గ్రూప్‌–4లో జిల్లా 14వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు.  అలాగే ఇండియన్‌ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సాధించాడు. ఇటీవల విడుదలైన మండల వ్యవసాయ అధికారి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాయికిరణ్ ఇలా వ‌రుస‌గా మూడు ఉద్యోగాలకు ఎంపికవ్వడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

☛ UPSC Civils 1st Ranker Aditya Srivastava Story : సివిల్స్‌లో నా నెం-1కి ప్లాన్ ఇదే.. శ్రీవాత్సవ నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన మంచి విష‌యాలు ఇవే..

స్పందన.. ఏవో ఉద్యోగానికి ఎంపికైందిలా..
తెలంగాణ‌లోని జన్నారం మండలంలోని పొనకల్‌ గ్రామానికి చెందిన జాడి రాజలింగం – రేణుక దంపతుల కూతురు స్పందన. ఈమె ఇటీవ‌లే మండల వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెను జగిత్యాల డిప్యూటీ కలెక్టర్‌ చిత్రుపటేల్‌ ఆదివారం పొనకల్‌లో అభినందించారు.

☛ UPSC Civils 2nd Ranker Animesh Pradhan Story : చిన్న వ‌య‌స్సులోనే నాన్న మృతి.. మ‌రో వైపు సివిల్స్ ఇంట‌ర్వ్యూ టైమ్‌లోనే అమ్మ మ‌ర‌ణం.. ఆ బాధతోనే..

స్పందన 2022లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తిచేసింది. 2023 జనవరిలో భారత ఆహార సంస్థ నిర్వహించిన ఉద్యోగ పరీక్షలో టెక్నికల్‌ అసెస్టింట్‌ ఉద్యోగం సాధించి మంచిర్యాలలో ఉద్యోగం చేస్తున్నారు. 2023 మేలో నిర్వహించిన మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదల కాగా.. ఏవో ఉద్యోగం సాధించింది స్పందన. తమ కూతురు ప్రభుత్వ కొలువులు సాధించినందుకు సంతోషంగా ఉందని స్పందన తల్లిదండ్రులు తెలిపారు.

#Tags