Success Story : గృహిణిగా ఉంటూ.. పిల్లలను చదివిస్తూ.. తాను చదువుకుంటూ.. 3 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను కొట్టానిలా.. కానీ..

ఒక గృహిణిగా ఉంటూ.. ఇంటి బాధ్య‌త‌ల‌ను చూసుకుంటూ.. ఏదైన ఉద్యోగం కొట్టాలంటే.. చాలా క‌ష్ట‌మైన ప‌ని. అందులో ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాలంటే.. ఒక చిన్న యుద్ద‌మే చేయాలి. కానీ తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన సిరికొండ సోన.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఉద్యోగాల‌ను సాధించి ఔరా అనిపించింది. ఈ నేప‌థ్యంలో సోన స‌క్సెస్ స్టోరీ మీకోసం..

ఎడ్యుకేష‌న్ : 
సిరికొండ సోన ఒకటి నుంచి పదో తరగతి వరకు నిర్మల్‌లోని సరస్వతీ శిశుమందిరంలో చదివింది. ఇంటర్‌ నిర్మల్‌లోనే పూర్తి చేసింది. 2010లో వానల్‌పాడ్‌ గ్రామానికి చెందిన సిరి కొండ గాంధీతో వివాహామైంది. ఆ తర్వాత గాంధీ తన భార్య సోనను నిర్మల్‌లో డిగ్రీ, పీజీ చదివించాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చినప్పుడల్లా ప్రోత్సహించాడు.

☛ Sub Inspector Suman Kumari Success Story : ఈ ట్రైనింగ్‌కు మగవారే వెనకాడుతారు.. కానీ ఈమె మాత్రం..

ఒకే సారి టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలను..
ఒకేసారి మూడు ప్రభుత్వ కొలువులు సాధించి సిరికొండ సోన అందరి మన్ననలు పొందుతోంది. భైంసా మండలం వానల్‌పాడ్‌కు చెందిన గృహిణి పిల్లలను చదివిస్తూ.. తాను చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమై పోటీ పరీక్షలు రాసి కొలువులు దక్కించుకుంది. ఇటీవలే విడుదలైన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలను సాధించింది.

కుటుంబం :
సోన, గాంధీ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. రిశాంక్‌ ఆరవ తరగతి, రోహిత్‌మోను మూడో తరగతి చదువుతున్నారు. వారిద్దరిని చదివిస్తూ తానూ పోటీ పరీక్షకు సిద్ధమైంది. ఇటీవల గురుకులాల్లో ఉద్యోగాల ఫలితాలు వెలువడగా టీజీటీ, పీజీటీల్లో ఎంపికైంది. జూనియర్‌ లెక్చరర్‌గాను ఎంపికైంది. మా వివాహం అయ్యాక నా భర్త డిగ్రీ, పీజీ చదివించేందుకు ప్రోత్సహించాడు. ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపిక కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. 

☛ Telangana Women Secures Four Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

నా చూపు ఈ ఉద్యోగం వైపే..
జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేయాలని అనుకుంటున్నాను. నా భర్తతోపాటు కుటుంబీకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. చదువు విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రోత్సహించడంతోనే కొలువులు సాధించాను.

☛ Housewife Inspirational Success Story : గృహిణిగా బాధ్యతలు మోస్తూనే.. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

#Tags