Inspiring Success Story : యదార్ధ కథ.. ఆక‌లి త‌ట్టుకోలేక బిక్షాటన చేసి క‌డుపు ఆక‌లి తీర్చుకునే వాళ్లం.. ఈ క‌సితోనే చ‌దివి జిల్లా ఎస్పీ స్థాయికి వ‌చ్చానిలా..

ఇది కథ కాదు..ఇది నిజ‌జీవితంలో జ‌రిగిన యదార్ధ కథ. క‌ఠిన పేద‌రికం.. తిన‌డానికి తిండి కూడా లేని స్థితి. ఆక‌లితో బిక్షాటన చేసుకుని కడుపునింపుకునే వారు.

ఇంత దుర్భ‌లమైన జీవితం అనుభ‌వించి.. ఇప్పుడు అంద‌రు గ‌ర్వించే స్థాయికి వ‌చ్చాడు. ఇత‌నే అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు. ఈ నేప‌థ్యంలో అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఇది కథ కాదు.. ఇది నిజ‌జీవితంలో జ‌రిగిన ఓ యదార్ధత. ఓ చిన్న పిల్లవాడు బిక్షాటన చేసి చదువుకుని అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగిన స్ఫూర్తివంతమైన నిజం. ఆ అడిషనల్ ఎస్పీ జీవితం భావితరాల యువ‌త‌కు ఎంతో స్ఫూర్తి ఇస్తోంది.

☛ Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

స్మశానవాటికలో సమాధులకు.. 
అన్నం కోసం బిచ్చమెత్తుకుంటూ.. ఇళ్ల‌లో తీసేసిన బట్టలు అడిగి తెచ్చుకున్నారు. పగిలిన పలక ఎవరో ఇస్తే తీసుకుని.. ఎవరో దానం చేసిన బట్టలు వేసుకుని స్కూల్ ముందు నిలబడితే.. అప్పుడు స్కూల్‌లో చేర్చుకున్నారు. అంతటితో కష్టాలు తీరలేదు.. అడుక్కు తినేవాడు మా పక్కన కూర్చుకుని చదువుకోవడం ఏంటని అక్కడా వివక్ష ఎదుర్కొన్నాడు ఆ పిల్లవాడు. ఇల్లు ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకుని.. స్మశానవాటికలో సమాధులకు గుంతలు తవ్వి కష్టపడి చదువుకున్న ఆ పిల్లవాడు. ఇవాళ అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదిగాడు.

 Inspirational Story: పేదరికాన్ని జ‌యించాడు... సివిల్స్ స‌త్తా చాటాడు..

ఆక‌లి త‌ట్టుకోలేక‌.. తల్లి, కొడుకు ఇద్దరూ..

ఆక‌లి త‌ట్టుకోలే.. తల్లి, కొడుకు ఇద్దరూ ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేసే వారు. తోటి పిల్లలు స్కూల్ కి వెళ్ళడం చూసి.. ఆ పిల్లవాడు స్కూల్‌కి వెళ్లి చదువుకోవాలనుకున్నాడు. కాని అడుక్కోడానికి వచ్చాడనుకుని స్కూల్ నుంచి బయటకు పంపించారు. ఎందుకంటే ఆ పిల్లవాడి ఒంటి మీద బట్టలు మాసిపోయి ఉన్నాయి. అందుకే స్కూల్‌లో చేర్చుకోలేదు. ఎలాగైనా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాలి అన్న పట్టదల ఆ పిల్లాడి ఒంటి మీద మాసిన బట్టలు ఆపలేక పోయాయి. చదువుకు ఉన్న గొప్పతనం ఏంటో తన జీవితమే ఒక ఉదాహరణ అంటున్నారు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు. 

☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

ఇంటింటికీ తిరిగి అడుక్కున్న తన తల్లిని ఇవాళ..

అలాగే చదువుకుంటే తప్ప భవిష్యత్ లేదని గ్రహించి.. బిక్షాటన చేసుకుని కడుపునింపుకునే తాను.. ఇవాళ ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. చదువుకు ఉన్న గొప్పతనం ఏంటో తన జీవితమే ఒక ఉదాహరణ అంటున్నారు అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతరావు. చదువుకుంటే తప్ప భవిష్యత్ లేదని గ్రహించి.. బిక్షాటన చేసుకుని కడుపునింపుకునే తాను.. ఇవాళ ఈ స్థాయికి వచ్చానన్నారు. తాను చదువుకోవడం వల్లే ఇంటింటికీ తిరిగి అడుక్కున్న తన తల్లిని ఇవాళ గౌరవిస్తున్నారన్నారు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు.

అందరి కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నాయి..
ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తాను బిక్షాటన చేసే వాడిని అని వందల మంది ముందు చెప్పడానికి ఏమాత్రం సిగ్గు, మొహమాటం పడలేదు. ఎందుకంటే ఆ కష్టాల వెనకాలా ఓ పది మంది పిల్లలు మారాలి అనేదే నా ఆలోచన. తన జీవన పోరాటం అందరి కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఈ జీవిత ప్ర‌స్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

☛ Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

☛ Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

☛ Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

#Tags