Real Life Inspire Success Story : నైట్ వాచ్‌మన్‌గా ప‌నిచేస్తూనే.. ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించానిలా.. కానీ..

సాధించాల‌నే క‌సి.. ప‌ట్టుద‌ల ఉంటే.. మనం ఎక్కడినుంచి వచ్చాం.. మన బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి అన్నది ముఖ్యం కాదు. మనం అనుకున్నది చివ‌రికి సాధించామా లేదా అన్నదే ముఖ్యం. మంచి స్ఫూర్తి ఇచ్చే ఒక ఆస‌క్తి స‌క్సెస్ స్టోరీని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ మీకోసం ప్ర‌త్యేకంగా అందిస్తుంది.

గొల్లె ప్రవీణ్.. ఈయ‌న ఒక వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్నాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వాచ్‌మెన్‌గా పనిచేస్తూనే లక్ష్యం వైపు గురి పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగమనే కలను నెరవేర్చుకోవడం.. మరో వైపు కుటుంబానికి భారం కాకుండా స్వయం ఉపాధి పొందడం ఇదే ప్రవీణ్‌ కళ్ల ముందున్న లక్ష్యాలు. 

రాత్రి సమయంలో..
అందుకే ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్‌ మల్టీమీడియా రిసెర్చ్‌ సెంటర్‌ (ఈఎంఆర్‌సీ)లో నైట్ వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. రాత్రి సమయంలో వాచ్‌మేన్‌గా పని చేస్తూ పగలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు. ఎట్టకేలకు అతని కష్టం ఫలించింది. కేవలం పదిరోజుల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు.

☛ Telangana Women Secures Four Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

తనలాంటి ఎందోమందికి..

ప్రవీణ్ టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్‌ ఉద్యోగాలను సాధించాడు.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తనలాంటి ఎందోమంది కొత్త ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. పేదరికం ప్రతిభకు ఆటంకం కాదని నిరూపించాడు గొల్లె ప్రవీణ్. 
 
కుటుంబ నేప‌థ్యం : 
ప్రవీణ్.. తల్లి పోసమ్మ. ఈమె బీడీ కార్మికురాలు. తండ్రి పెద్దులు. ఈయ‌న‌  రోజుకూలీగా పనిచేస్తున్నారు.

☛ IPS Manoj Kumar Sharma Inspiring Story : '12th Fail' ఫెయిల్.. బిచ్చగాళ్లతో పడుకున్నా..ఈ క‌సితోనే ఐపీఎస్ అయ్యా.. కానీ..

#Tags