Telangana Anganwadi Centers : అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే..
సాక్షి ఎడ్యుకేషన్ : జయశంకర్ జిల్లాలో కాటారం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–3, రేగులగూడెం, జాదారావుపేట, మల్హర్ మండలం తాడిచర్ల సెంటర్ 2, చిన్నతూండ్ల సెంటర్ 2, రుద్రారం 2, మహాముత్తారం మండలకేంద్రంలోని అంగన్‌వాడీ 3, 4, ములుగుపల్లి, దుంపిల్లపల్లి, రేగులగూడెం అంగన్‌వాడీ కేంద్రాలను అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ జనవరి 18వ తేదీన (గురువారం) పరిశీలించారు.
ఈ సందర్భంగా భవనాల స్థితిగతులు, సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల హాజరు శాతం, అద్దె భవనంలో ఏర్పడుతున్న ఇబ్బందులను అంగన్‌వాడీ సిబ్బందిని అడిగి తెలుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ నాగేశ్వర్‌రావు, సీడీపీఓ రాధిక, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ మమత, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
#Tags