SRB GNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

ఖమ్మం కోఆపరేటివ్ నగర్: ఖమ్మం SRB GNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ మొహమ్మద్ జహీర్ ఉల్లా గారు గెస్ట్ లెక్చరర్స్ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.

ఖాళీలు: చరిత్ర మరియు గణిత శాస్త్రంలో తలా మూడు, రాజకీయ శాస్త్రంలో రెండు, మరియు ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, BCA, డేటా సైన్స్, బయోటెక్నాలజీ విభాగాలలో తలా ఒకటి చొప్పున గెస్ట్ లెక్చరర్స్ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల ఫోటోకాపీలతో పాటు దరఖాస్తులను ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కళాశాల కార్యాలయానికి సమర్పించవచ్చు.

అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

చదవండి: Degree Lecturer Jobs: డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ 2024.. దరఖాస్తు ప్రక్రియ ఇలా..

అర్హత ప్రమాణాలు: జనరల్ మరియు BC కేటగిరీలకు పీజీ లో 55% మార్కులు, SC మరియు ST కేటగిరీలకు 50% మార్కులు సాధించాలి. NET, SET లేదా పీహెచ్.డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

#Tags