ఉద్యోగప్రాప్తిరస్తు.. 1998 డీఎస్సీ అభ్యర్థులతో నియామకం

రాయవరం: రెండు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న డీఎస్సీ–1998 అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఉద్యోగప్రాప్తిరస్తు.. 1998 డీఎస్సీ అభ్యర్థులతో నియామకం

డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తానంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వారితో భర్తీ చేస్తుంది. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకూ అర్హులు వారి అంగీకారాన్ని తెలుపుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గతేడాది అక్టోబర్‌ 6 నుంచి 14వ తేదీ వరకూ పరిశీలించి సీనియారిటీ జాబితాను రూపొందించారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరేందుకు 486 మంది అంగీకరించారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

ఎంత మందికి అవకాశమంటే..

ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లకు, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి హెచ్‌ఎంలకు, హెచ్‌ఎంల నుంచి ఎంఈఓలకు పదోన్నతులు తాత్కాలిక ప్రాతిపదికన చేట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా సర్దుబాట్లు చేసింది. పదోన్నతులు, సర్దుబాట్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పడిన ఖాళీల్లో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను నియమిస్తుంది. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను నియమించనున్నట్లు సమాచారం. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 285 మందికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల ప్రకారం నియామకం చేపట్టనున్న 285 మంది క్వాలిఫైడ్‌ అభ్యర్థుల జాబితాను డీఈవోఈజీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈ జాబితాలో అభ్యర్థులు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ నందు నియామకం పొంది, 60 ఏళ్లలోపు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పనిచేయడానికి అంగీకరించిన వారు హాల్‌ టికెట్‌, అంగీకార పత్రాలు, అర్హత ధ్రువపత్రాలు, మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో ఏప్రిల్ 12వ తేదీ బుధవారం కాకినాడ సమగ్ర శిక్ష సమావేశ హాలులో ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

#Tags