Teaching Staff Jobs: బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. అర్హతలు ఇవే..
ఆసిఫాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన బోధన సి బ్బంది పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సతీశ్ సెప్టెంబర్ 13న ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆరు ప్రొఫెసర్, 20 అసోసియెట్ ప్రొఫెసర్, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్, 52 సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
అర్హత ఉన్న అభ్యర్థులు విద్యార్హత, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతో మెడికల్ కళాశాలలో సెప్టెంబర్ 20న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూల కు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరా లకు https://gmckumurambheemasif abad. org ను సందర్శించాలన్నారు.
#Tags