Medical Counseling: సకాలంలో మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి.. కళాశాలల వివరాలు, సీట్ల వివరాలు కోసం క్లిక్ చేయండి
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌ను పూర్తి చేసి, తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రాంత విద్యార్థులకే సీట్లు దక్కాలన్నది తమ ఆలోచన అని, ఈ విషయంలో రాజీ పడేది లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని, ఈలోగా వెబ్ ఆప్షన్ల నమోదు కోసం విద్యార్థులు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.
సెప్టెంబర్ 14న ఉదయం 11 గంటల నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వివరాలు, సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో (https://www.knruhs.telangana. gov.in/) అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
గతేడాది ఏయే ర్యాంకు విద్యార్థులకు ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయన్న వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఆయా వివరాలను పరిశీలించి, తమ ర్యాంకులకు అనుగుణంగా వెబ్ ఆప్షన్ల కోసం జాబితాను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.
Tags
- Medical counseling
- MBBS
- BDS
- Medical Health Department
- Damodara Rajanarsimha
- Medical Counseling Committee
- MBBS Counselling
- Students of Telangana Region
- knruhs
- NEET UG counselling process
- Medical Admissions
- NEET UG 2024 Counselling Dates
- neet ug 2024 counselling schedule
- neet 2024
- Telangana News
- MBBSCounseling
- BDSCounseling
- DamodaraRajanarsimha
- HyderabadEducation
- MBBSBDSAdmission
- CounselingSchedule
- HealthMinisterStatement
- September13Announcement
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024