Department of Education: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఈ పని చెయడంపై నిషేధం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తరగతి గదిలో సెల్ ఫోన్ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సెప్టెంబర్ 13న సర్క్యూలర్ ను జారీ చేశారు.
ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచా లని ఆదేశించారు. తరగతి గదుల్లో కొందరు ఉపాధ్యాయులు సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టు సమాచారం ఉందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
చదవండి: KGBVలో స్కావెంజర్ పోస్టు కోసం దరఖాస్తుల ఆహ్వానం
దీనిని నివారించడం కోసం సర్క్యూలర్ ను జారీ చేసినట్లు చెప్పారు. దీని ప్రకారం ఇక నుంచి తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్ మాట్లా డడం నిషేధం. సీసీఏ మార్గదర్శకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తు న్నట్టు అధికారులు తమ సర్క్యూలర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యా యులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
Published date : 14 Sep 2024 05:36PM