SSC CHSL latest Notification 2024: 3712 పోస్టుల భర్తీకి SSC CHSL నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ(10+2) లెవెల్‌ ఎగ్జామినేషన్‌– 2024కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 3712 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 3712
పోస్టుల వివరాలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌ ఏ). 
అర్హతలు: 10+2/ఇంటర్మీడియెట్‌ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. 01.08.2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కన్సూమర్‌ అఫైర్స్, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ), డేటా ఎంట్రీ ఆపరేటర్‌æ గ్రేడ్‌ ఏ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌లో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
వయసు: 01.08.2024 నాటికి 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10–15ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 
వేతనం: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/జూనియర్‌ సె­క్రటేరియట్‌ అసిస్టెంట్‌ రూ.19,900–63,200; డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) రూ.29,200–92,300; డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌ ఏ రూ.25,500–81,100 వేతన శ్రేణి లభిస్తుంది.
 
ఎంపిక విధానం: టైర్‌1, టైర్‌ 2 పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.05.2024
దరఖాస్తుల సవరణ తేదీలు: 10.05.2024 నుంచి 11.05.2024
టైర్‌ 1 పరీక్ష తేదీలు: జూలై 1–12 తేదీల్లో.
టైర్‌ 2 పరీక్ష తేదీలు: తర్వాత వెల్లడిస్తారు. 

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

చదవండి: Junior Engineer Jobs at SSC: కేంద్రంలో జూనియర్‌ ఇంజనీర్‌ కొలువులు.. ఎంపిక విధానం, సిలబస్‌ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags