Indian Navy : ఇండియన్‌ నేవీలో ఎంఆర్ మ్యుజీషియ‌న్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

ఇండియన్‌ నేవీలో అగ్నివీర్‌ (ఎంఆర్‌ మ్యుజీషియన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2024 (నవంబర్‌ 24) బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

»    అర్హత: పదో తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. మ్యూజికల్‌ ఎబిలిటీ, మ్యూ­జికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
»    వయసు: అభ్యర్థి 01.11.2003 నుంచి 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
»    కనిష్ట ఎత్తు ప్రమాణాలు: పురుషులు, మహిళల ఎత్తు 157 సెం.మీ.ఉండాలి.
»    ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌ మార్కులు, స్టేజ్‌–1(ప్రిలిమినరీ స్క్రీనింగ్‌), స్టేజ్‌ 2 (ఫైనల్‌ స్క్రీనింగ్‌), మ్యూజిక్‌ స్క్రీనింగ్‌ టెస్ట్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
»    శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 
»    వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం 
ఉంటుంది.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.07.2024.
»    శిక్షణ ప్రారంభం: 2025 నవంబర్‌.
»    వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

Degree admissions 2024 : నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు

#Tags