Two Days Schools Holidays : రేపు, ఎల్లుండి స్కూల్స్‌కి సెలవు ప్రకటన.. అలాగే ఉద్యోగులకు కూడా... ఎందుకంటే...?

ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన హజ్రత్ అలీ షహాదత్ ను గుర్తు చేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది. కానీ తర్వాత ఈ సెలవును మార్చి 22వ తేదీనికి మార్చింది. ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ.. అది సాధారణమైన సెలవు కాదు కాదు.. ఐచ్చికం మాత్రమే. ఈ సెలవు స్కూల్స్, కాలేజీలకు ఇతర మైనార్జీ సంస్థలు సెలవులు ప్రకటించవచ్చు. మార్చి 23వ తేదీన ఆదివారం కావడంతో వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి విద్యాసంస్థలకు ఎదో ఒక రూపంలో సెలవులు వస్తున్నాయి. ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతోంది... ముస్లింలు ఈ నెలంతా ఉపవాస దీక్షలు చేపడతారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ముస్లింలకు పలు ఐచ్చిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
అలాగే వచ్చే వారంలో కూడా...
వచ్చే వారం కూడా తెలంగాణ ఉద్యోగులకు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు సెలవులే సెలవులు వస్తున్నాయి. మార్చి 28 రంజాన్ మాసంలో చివరి శుక్రవారం... ఈ రోజును జుమాతుల్ వదా లేదా షబ్-ఎ-ఖదర్ గా జరుపుకుంటారు ముస్లింలు. కాబట్టి ఆరోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత మార్చి 29వ తేదీన శనివారం ఒక్క రోజు విద్యాసంస్థలు నడుస్తాయి. ఆ తర్వాత మార్చి 30న ఉగాది. ఆ రోజు ఎలాగూ ఆదివారమే కాబట్టి సెలవు ఉంటుంది. ఇక మార్చి 31న రంజాన్ సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు అంటే ఏప్రిల్ 1న కూడా ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ఇలా వచ్చేవారం వరుసగా మూడురోజులు మొత్తంగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి.
ఏప్రిల్‌లో కూడా దాదాపు...
ఈ మార్చి నెల ముగియగానే వచ్చే ఏప్రిల్ నెలలో కూడా భారీ సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 1 రంజాన్ తర్వాతి రోజు, ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి, ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ప్రైడే సాధారణ సెలవులు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 10వ తేదీన మహవీర్ జయంతి, ఏప్రిల్ 14వ తేదీన తమిళ్ న్యూ ఇయర్, ఏప్రిల్ 30 బసవ జయంతి సందర్భంగా ఐచ్చిక సెలవులు ఉన్నాయి. ఇలా ఏప్రిల్‌లో కూడా దాదాపు 10 రోజులు వరకు సెలవులు రానున్నాయి. అలాగే ఏప్రిల్ చివరి వారంలో స్కూల్స్ సమర్ హాలిడేస్ ఇవ్వనున్నారు.
రెండు రోజుల పాటు సమ్మె.. దీంతో..
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటుండటంతో బ్యాకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ఈ వీకెండ్ రెండ్రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి... వీటికి ఈ సమ్మె తోడవుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఇలా వరుస సెలవులు, ఉద్యోగ సంఘాల సమ్మె బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ నెలాఖరున ఉగాది, రంజాన్ పండగలు వస్తున్నాయి.. ఆలోపు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు పూర్తిచేయాలని అనుకుంటున్న బ్యాంకులకు ఉద్యోగుల సమ్మె ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సమ్మెలో కొన్ని బ్యాంకుల ఉద్యోగులు మాత్రమే పాల్గొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు ఈ యూఎఫ్ బియూలో ప్రాతినిధ్యం ఉంది. ఇలా మొత్తంగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఈ యూనియల్ లో ఉన్నారు.
మార్చి 22,23,24,25 తేదీల్లో...
వీరంతా మార్చి 24, 25 (సోమ,మంగళవారం) జరిగే సమ్మెలో పాల్గొంటారు. అంతకు ముందు రెండ్రోజులు అంటే మార్చి 22, 23 (శని, ఆదివారం) బ్యాంకులన్నింటికి సెలవులు వస్తున్నారు. మార్చి 22వ తేదీన నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇలా వరుసగా మార్చి 22,23,24,25 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి–2025 నుంచి డిసెంబర్ 2025 వరకు సెలవులు ఇవే.. :
మార్చి–2025 :
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31
ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18
జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07
జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06
ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27
సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05
అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20
నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05
డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26