Two Days All Schools Holidays Due To Heavy Rain : బ్రేకింగ్ న్యూస్.. అత్యంత భారీ వర్షాలు.. 2 రోజులు స్కూల్స్‌కు సెలవులు.. ఇంకా..
ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు.. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ..
విశాఖనగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే భారీ వర్షాల కారణంగా విశాఖ, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. అలాగే ఏపీలో కొన్ని కాలేజీలకు కూడా సెలవులు ఇస్తున్నారు.
నేడు, రేపు కూడా...ఇంకా..
రానున్న 24 గంట్లలో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈ క్రమంలో నేడు, రేపు.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. విజయవాడలో కుండపోతగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
అన్ని పాఠశాలకు విద్యాశాఖ అధికారులు...
విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.
ఈ జిల్లాల్లోనే..
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రహదారులు జలమయమయ్యాయి. కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం-కేశ్యాతండా మధ్య వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీలోని మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.
ఈ జిల్లాలకు రెండు రోజులు పాటు సెలవులు..
తాజాగా గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, Krishna జిల్లా, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. దీంతో స్కూల్స్‌కు రెండు రోజులు పాటు సెలవులు ఇచ్చారు.
తెలగాణలో కూడా స్కూల్స్‌కు..
అలాగే తెలంగాణలో కూడా వివిధ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయజిల్లాల కలెక్టర్లు పరిస్థితిని బట్టి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నేడు, రేపు వరుసగా స్కూల్స్, సెలవులు రావడంతో విద్యార్థులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అనుకోకుండా విద్యాసంస్థలకు సెలవులు ఎక్కువగా వస్తున్నాయి.
2024లో Schools & Colleges సెలవులు వివరాలు ఇవే...
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన సెలవులు ఇవే..
➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.