Tomorrow Schools Holiday : రేపు స్కూల్స్‌కు సెల‌వు.. కార‌ణం ఇదే

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌కు సెప్టెంబ‌ర్ 7వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించారు. భారీగానే సెల‌వులు రానున్నాయి. శ్రావణ మాసం రావడంతో ఇక పండుగల సీజన్ ప్రారంభమైంది.

సెప్టెంబ‌ర్ 7వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండ‌గ సంద‌ర్భంగా సెల‌వును ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే భారీ వ‌ర్షాల‌తో స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. దీంతో స్కూల్స్‌, కాలేజీల‌కు వరుసగా సెలవులు (Schools & Colleges Holidays) వ‌చ్చాయి. సెప్టెంబ‌ర్ నెల‌లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఉన్నాయి.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

సెప్టెంబర్ నెల‌లో సెలవుల పూర్తి వివరాలు ఇవే..
☛ సెప్టెంబర్ 7- శ్రీకృష్ణ జన్మాష్టమి
☛ సెప్టెంబర్ 9- రెండో శనివారం
☛ సెప్టెంబర్ 10- ఆదివారం
☛ సెప్టెంబర్ 17- ఆదివారం
☛ సెప్టెంబర్ 18- వినాయక చవితి
☛ సెప్టెంబర్ 23- నాలుగో శనివారం
☛ సెప్టెంబర్ 24- ఆదివారం
☛ సెప్టెంబర్ 28- మిలాద్ ఉన్ నబీ

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

సెప్టెంబర్ 7 గురువారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు. సెప్టెంబర్ 9 రెండో శనివారం, సెప్టెంబర్ 10 ఆదివారం సందర్భంగా సెలవు. కాబట్టి సెప్టెంబర్ 8 శుక్రవారం సెలవు తీసుకుంటే లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి. అలాగే ప్ర‌స్తుతం వ‌ర్షాకాలంలో భారీ వ‌ర్షాల కార‌ణంతో కూడా కొన్ని కొన్ని స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్‌లో కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు.

☛ School & Colleges Holiday list in September 2023 : సెప్టెంబ‌ర్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

#Tags