High School: హైస్కూల్‌ ప్లస్‌ స్థాయికి మూడు ఉన్నత పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌ పరిధిలో మూడు ఉన్నత పాఠశాలలు హైస్కూల్‌ ప్లస్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యాయి.
హైస్కూల్‌ ప్లస్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయిన రాజవొమ్మంగి జెడ్పీ ఉన్నత పాఠశాల

రాజవొమ్మంగి, అడ్డతీగల మండల కేంద్రాలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, దేవిపట్నం మండలంలోని ఇందుకూరుపేట గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌ స్థాయికి పెంచుతూ విద్యాశాఖ నుంచి తగిన ఉత్తర్వ్యులు అందాయని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మజీరావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ మూడు ఉన్నత పాఠశాలలు ఇంటర్‌ స్థాయికి పెరగడంతో ఈపాఠశాలల్లో టెన్త్‌ చదువుతున్న 200మంది విద్యార్థిని, విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలన్నీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో టెన్త్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఉత్తీర్ణులైతే ఇక్కడే ఇంటర్‌ చదువులకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.

చదవండి: Model United Nation: ఎస్‌ఆర్‌ వర్శిటీలో ‘మోడల్‌ యునైటెడ్‌ నేషన్‌’

#Tags