Skip to main content

America Entrance Exams Which Is Better AP vs SAT or ACT: అమెరికాలో హైస్కూల్‌ స్టడీ.. AP లేదా SATలో ఏది తీసుకోవాలి?

America Entrance Exams Which Is Better AP vs  SAT or ACT

అమెరికా హైస్కూల్‌లో ap/IB ప్రోగ్రామ్స్‌ తీసుకోవడం వల్ల  కాలేజ్‌ అడ్మీషన్స్‌లో అడ్వాండేజ్‌ ఎంత వరకు ఉంటుంది? జూనియర్‌ లెవర్‌లో ఎన్ని ap ప్రోగ్రామ్‌లు తీసుకోవాలి వంటి పలు వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. 
 

1. ACT కి  ప్రాక్టీస్‌ చేయడానికి ఏవైనా వెబ్‌సైట్స్‌ ఉన్నాయా?
జ: ఆన్‌లైన్‌లో వెతికితే చాలా ఆప్షన్స్‌ ఉంటాయి. ఓసారి రీసెర్చ్‌ చేస్తే మంచిది. 

2. టీచర్స్‌ రికమండేషన్‌ ప్రకారం మా అబ్బాయి/అమ్మాయికి ఫిజిక్స్‌ హానర్స్‌ను ఎంచుకోమని రికమండ్‌ చేశారు. ఈ కోర్స్‌ తీసుకోవచ్చా లేదా ap తీసుకోవడం మంచిదంటారా?
జ:స్టూడెంట్‌ బలం, బలహీనతలు టీచర్స్‌కి తెలిసి ఉంటాయి. వాళ్ల కెపబిలిటీని బట్టి రికమండ్‌ చేసి ఉంటారు కాబట్టి వాళ్లు చెప్పింది చేయడం బెటర్‌. 

3. ap/IB ప్రోగ్రామ్స్‌ని హైస్కూల్‌లో తీసుకోవడం వల్ల కాలేజ్‌ అడ్మీషన్స్‌లో అడ్వాండేజ్‌ ఎంత వరకు ఉంటుంది?
జ: ఇవి చాలెంజింగ్‌ కోర్సులు. దీని వల్ల అడ్మీషన్స్‌లో అడ్వాంటేజ్‌ తప్పకుండా ఉంటుంది. 

4. ఎక్కువ AP ప్రోగ్రామ్స్‌ తీసుకుంటే కాలేజ్‌ అడ్మీషన్స్‌కి ఉపయోగంగా ఉంటుందా?
జ: ఏదైనా ఎక్కువ మంచిది కాదు. ఒకేసారి ఎక్కువ AP ప్రోగ్రామ్స్‌ తీసుకోవడం వల్ల అకడమిక్స్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటిస్‌ చేయడానికి సమయం సరిపోదు. దీనివల్ల బ్యాలెన్స్‌ మిస్‌ అవుతారు. అడ్మీషన్స్‌లోనూ కేవలం అకడమిక్స్‌కే కాకుండా, క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇస్తారు కనుక ఎక్కువ AP లు తీసుకోకుండా మీ సామర్థ్యాన్ని బట్టి తీసుకోవడం బెటర్‌. 

5. మా అబ్బాయి స్విమ్మింగ్‌, టెన్నిస్‌ వంటి క్రీడల్లో చురుగ్గా ఉంటాడు. అయితే దీనికి సంబంధించిన వాళ్లు ఎలాంటి సర్టిఫికేట్స్‌ ఇవ్వలేదు. కాలేజీ అడ్మీషన్స్‌లో స్పోర్ట్ష్‌ కేటగిరిని ఎంత వరకు ఉపయోగించుకోవచ్చు?
జ:క్రీడలు తప్పకుండా అడ్వాంటేజ్‌ అవుతాయి. సర్టిఫికేట్స్‌ లేకపోయినా స్కూల్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్న అవీవ్‌మెంట్స్‌ని బట్టి కూడా అడ్మీషన్స్‌ పొందొచ్చు. 

6. మనబడి మ్యూజిక్స్‌/డ్యాన్స్‌ క్లాసులు అడ్మీషన్స్‌కి ఉపయోగపడతాయా?
జ:ఏదైనా అంశంలో కొన్నేళ్ల పాటు మీరు ప్రావీణ్యం సంపాదించగలిగితే యాక్టివిటీస్‌లో మిమ్మల్ని మీరు ప్రూవ్‌ చేసుకునే ఆస్కారం ఉంటుంది. 

7. ఒక ఏడాది మ్యాథ్స్‌ లేదా సైన్స్‌లో AP తీసుకుంటే తర్వాతి సంవత్సరాల్లో, హైస్కూల్‌ పూర్తయ్యే వరకు అదే సబ్జెక్ట్‌ను కంటిన్యూ చేయాల్సి ఉంటుందా?
జ: లేదు. AP కోర్సు కేవలం ఒక ఏడాదికే పరిమితం అవుతుంది. 

8. కరాటే స్పోర్ట్స్‌ కిందకే వస్తుందా? ఇది స్పోర్స్‌ కేటగిరిలో కాలేజ్‌ అడ్మీషన్‌కి పనికొస్తుందా?
జ: అవును తప్పకుండా పనికొస్తుంది. 

9.  AP క్లాసులకి ఏదైనా క్రైటీరియా ఉంటుందా? హానర్స్‌ చదవకుండా డైరెక్ట్‌గా AP క్లాసులు తీసుకోవచ్చా?
జ: ఒకేసారి AP తీసుకుంటే కాస్త కఠినంగా అనిపించొచ్చు. అందుకే ముందు హానర్స్‌ తీసుకొని ఆ తర్వాత AP తీసుకోవడం బెటర్‌. ఒకవేళ మీరు ఛాలెంజెస్‌ని తీసుకోగలరు అని నమ్మకం ఉంటే తీసుకోవచ్చు. ఇది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. 

10. మా అబ్బాయి 9వ తరగతిలో ఉండగా మేం అమెరికా వచ్చాం. 2024-25 సెప్టెంబర్‌కు వచ్చే సరికి తను జూనియర్‌ అవుతాడు. తన గ్రేడ్స్‌ని బట్టి కేవలం హానర్స్‌లోనే ఎక్కువ స్కోర్‌ చేస్తున్నాడు. కాలేజీ అడ్మీషన్స్‌ కోసం ఇంకా ఏం చేస్తే మంచిది?
జ: జూనియర్‌ లెవల్‌లో ఉన్నప్పుడే కొన్ని ap కోర్సులు తీసుకుంటే మంచిది. ఇది కాలేజీ అడ్మీషన్స్‌లో ఉపయోగపడుతుంది. 

11. హానర్స్‌, ap ప్రోగ్రామ్స్‌ వేటికి ఎక్కువ గ్రేడ్స్‌ ఉంటాయి?
జ: రెగ్యులర్‌ కోర్సులు తీసుకుంటే వచ్చే క్రెడిట్స్‌ కంటే AP కోర్సులు ఎంచుకుంటే ఎక్కువ క్రెడిట్స్‌ వస్తాయి. 

Published date : 08 Apr 2024 05:38PM

Photo Stories