Teachers Day Special: అరుదైన అవకాశం.. చదువుకున్న స్కూలుకే టీచర్లుగా..

మదనపల్లె సిటీ: దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపు దిద్దుకుంటుందన్నది నానుడి. చిన్నప్పుడు చదివిన పాఠశాలకు తాము ఉపాధ్యాయులుగా వస్తామని వారు ఊహించి ఉండరు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కొందరు పాఠశాలల అభివృద్ధికి శ్రమిస్తున్నారు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా
ఇలాంటి అరుదైన అవకాశం తమకు లభించినందుకు గర్వపడుతున్నారు మదనపల్లె పట్టణం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఇదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని నేడు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.

Alibaba Founder Jack Ma Inspiring Story: ఎగ్జామ్‌లో ఫెయిల్‌.. ఒక్క ఉద్యోగానికి కూడా సెలక్ట్‌ కాలేదు, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే కోటీశ్వరుడిగా..

ఇలాంటి అరుదైన సంఘటన ఏ పాఠశాలలో కన్పించదు. వసుధ (హిందీ), సునందిని (ఇంగ్లీషు), సోగ్రోని (హింది), వహిదా రహమాన్‌( మ్యాథ్స్‌), శ్రీరామచంద్ర(క్రాఫ్ట్‌ టీచర్‌), రాజారెడ్డి(మ్యాథ్స్‌), సహదేవ( సైన్సు), ముబారక్‌బాషా (హిందీ)లు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. 
 

#Tags