Skip to main content

Teachers Day: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తుల ఆహ్వానం

విద్యారణ్యపురి: డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం కోసం జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌, కేజీబీవీ, టీఎస్‌ఆర్‌డబ్ల్యూఎస్‌, టీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌, జేబీపీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయులు/ప్రిన్సి పాళ్లు/హెచ్‌ఎంల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు హనుమకొండ డీఈఓ డాక్టర్‌ ఎండీ అబ్దుల్‌హై ఒక ప్రకటనలో తెలిపారు.
Invitation of applications for Best Teacher Awards

అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే గెజిటెడ్‌ ఉపాధ్యాయులు/రెసిడెన్షియల్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు కనీసం 15 సంవత్సరాలు, ఉపాధ్యాయులు/పీజీటీలకు కనీసం 10 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలని, సర్వీసులో ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండకూడదని సూచించారు.

చదవండి: Regadimailaram High School: సీఎం సారూ... ఇక్కడ ఐదు తరగతులకు ఒక్కరే సారు!

ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తులతోపాటు రెండు సెట్ల ప్రొఫైల్స్‌ను జతపరిచి ఆగస్టు 16వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు డీఈఓ సమర్పించాలని కోరారు.

Published date : 31 Jul 2024 05:02PM

Photo Stories