Skip to main content

Regadimailaram High School: సీఎం సారూ... ఇక్కడ ఐదు తరగతులకు ఒక్కరే సారు!

బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.
Regadimailaram High School

ఆరు నుంచి పదో తరగతి వరకు 146 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నారు. అక్కడ పనిచేసేందుకు చాలా మంది స్కూల్‌ అసిస్టెంట్లు సుముఖంగా ఉన్నప్పటికీ పాఠశాలకు అధికారిక పోస్టులు మంజూరు కాకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. 

అప్‌గ్రేడ్‌ చేసి.. వదిలేశారు! 

రేగడిమైలారం ప్రాథమిక పాఠశాలను 2005–06లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పట్లో స్కూల్‌కు ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ను మాత్రమే నియమించారు. 2007లో ఎనిమిదో తరగతిని సైతం అందుబాటులోకి తెచి్చనా కొత్త పోస్టులు ఇవ్వలేదు.

2016 వరకు ప్రైమరీ సిబ్బందితోనే 8వ తరగతి వరకూ నెట్టుకొచ్చారు. 2017–18లో పదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసినా కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో 2006లో వచి్చన ఒకే ఒక్క ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌తోనే 18 ఏళ్లుగా హైస్కూల్‌ను నడిపిస్తున్నారు.

చదవండి: Agniveer Posts: ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు అగ్నివీర్ పోస్టుల్లో అవ‌కాశం..!

గతేడాది ఆరు నుంచి పదో తరగతి వరకు 154 మంది విద్యార్థులు చదివారు. వారిలో 28 మంది టెన్త్‌ విద్యార్థులు ఉండగా 9 మందే ఉత్తీర్ణులయ్యా రు. ఈసారి పాఠశాలలో మొత్తం 146 మంది ఉండగా వారిలో 19 మంది టెన్త్‌ చదువుతున్నారు.

ఒకే ఆవరణలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా ప్రైమరీ స్కూల్‌లో ఏడుగురు ఎస్‌జీటీలు, హైసూ్కల్‌లో ఒకే ఒక్క స్కూల్‌ అసిస్టెంట్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో హైసూ్కల్‌ విద్యార్థులకూ ప్రైమరీ టీచర్లే పాఠాలు బోధిస్తున్నారు. సబ్జెక్ట్‌ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఈ స్కూల్‌ హైదరాబాద్‌– బీజాపూర్‌ హైవేను ఆనుకొని ఉండటంతోపాటు సీఎం సొంత నియోజకవర్గం కావడం గమనార్హం.  

కలుపు తీసేందుకు వెళ్తున్నా..  
బడికి వెళ్లి చదువుకోవాలని ఉన్నా పాఠాలు చెప్పేవారు లేరు. ఎలాగూ క్లాసులు జరగడం లేదు. కనీసం అమ్మానాన్నలకు ఆసరాగా ఉందామని సమయం దొరికినప్పుడల్లా పత్తిలో కలుపు తీసేందుకు వెళ్తున్నా.  
– భూమిక, ఎనిమిదో తరగతి, రేగడిమైలారం

ఎవరికీ న్యాయం చేయలేకున్నాం 
పీఎస్, జెడ్పీహెచ్‌ఎస్‌లు ఒకే ఆవరణలో ఉన్నందునహైసూ్కల్‌ విద్యార్థులకు డిçప్యుటేషన్‌పై మేమే పాఠాలు చెబుతున్నాం. దీంతో అటు ప్రైమరీ, ఇటు హైసూ్కల్‌ విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికారులు, సీఎం స్పందించి పోస్టులు ఇవ్వాలి. 
– మల్లేశ్, పీఎస్‌ హెచ్‌ఎం, రేగడిమైలారం
 

Published date : 01 Aug 2024 09:46AM

Photo Stories