Students at Entrance Exam: గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య..!

ఐదవ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆదివారం గురుకుల ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రాల్లో పరీక్ష కోసం పాల్గొన్న విద్యార్థుల సంఖ్యను గురుకు పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి తెలిపారు..

 

అనంతపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

DSC 2024 Update News : డీఎస్సీ-2024 మారిన కొత్త ప‌రీక్ష తేదీలు ఇవే.. ఈ సారి ఈ ప‌రీక్ష‌ల‌ను..

480 సీట్లకు గాను 10,234 మంది దరఖాస్తు చేసుకోగా, 9,395 మంది హాజరయ్యారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షకు 1,200 సీట్లకు గాను 5,596 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,785 మంది హాజరయ్యారని అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి మురళీకృష్ణ తెలిపారు.

#Tags