TSMS 2024 Admissions: ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌రూరల్: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు వేళైంది. 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఇంటర్మీడియేట్ ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ తెలంగాణ ఆదర్శ పాఠశాలలు వరంగా మారాయి.
మోడల్ స్కూళ్లలోని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. జిల్లాలో టాప్ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పది పాసైన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Girls Gurukul Admissions: బాలికల గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ!
రెండు స్కూళ్లు.. 320 సీట్లు
జిల్లాలో రెండు తెలంగాణ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ పట్టణంతోపాటు సిర్పూర్(యూ)లోని కళాశాలలో సీఈసీ, ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. మొత్తం 320 సీట్లు భర్తీ చేయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రోస్టర్ విధానంలో ఎంపిక ఉంటుంది. వందమంది బాలికలకు హాస్టల్ వసతి కల్పించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే 9, 10, ఇంటర్ చదివే విద్యార్థులకు భోజన సదుపాయం కూడా ఉంటుంది.
సీట్ల భర్తీ ఇలా..
ఇంటర్మీడియట్‌కు సంబంధించి జిల్లాలోని రెండు మోడల్ స్కూళ్లలో 320 సీట్లు భర్తీ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం లేకుండా ఈ నెల 25లోగా http s:// www.tsmodelsc hools.co m/ admissions/ లింక్ ద్వారా వివరాలు సమర్పించాలి. ఈ నెల 27న జాబితా విడుదల చేస్తారు.
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..
29వ తేదీ నుంచి 31 వరకు ధ్రువపత్రాలు పరిశీలించి ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు. విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాం, కంప్యూటర్ విద్య, ఐఎఫ్‌పీ డిజిటల్ బోర్డులతో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేస్తారు.