Tab Usage: ట్యాబ్‌ వినియోగం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తెలియాలి..

డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో పాల్లొన్న వారికి ట్యాబ్‌ వినియోగం, విద్యార్థుల పుస్తకాల ఇన్‌స్పెక్షన్‌ గురించి జిల్లా విద్యాశాఖాధికారిణి తగిన ఆదేశాలిచ్చారు..

 

పార్వతీపురం టౌన్‌: ట్యాబ్‌ వినియోగంపై ప్రతి ఉపాధ్యాయులు, విద్యార్థులకు తెలియాలని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారిణి జి.పగడాలమ్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె స్ధానిక డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నెల 5వ తేదీ లోపు మండల విద్యాశాఖాధికారులంతా తమ విజిట్‌, ఇన్‌స్పెక్షన్‌, టూర్‌ ప్రోగ్రాంను డీఈఓ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. ప్రతి నెల 5వ తేదీన రివ్యూ నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రతి మండల కార్యాలయంలో ఇన్వార్డ్‌, ఔట్‌వర్డ్‌ రిజిస్టర్‌ వాడాలని సూచించారు.

Study In USA: అమెరికాలో హైస్కూల్‌ స్టడీ ఎలా ఉంటుంది? ఎలాంటి కోర్సులు తీసుకుంటే మంచిది?

ప్రతి ఉపాధ్యాయుడు ఎస్‌ఆర్‌ ప్రొఫైల్‌ ఎక్‌నాల్జ్‌మెంట్‌తో ఉండాలన్నారు. వర్క్‌బుక్‌, నోట్‌బుక్‌ కరెక్షన్‌ అన్ని పాఠశాలల్లో జరగాలని లేకుంటే చర్యలకు ప్రపోజ్‌ చేయాలని, అలా చేయని ఎంఈఓల మీద చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మండలంలోని అన్ని పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో 15 మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Law Education: న్యాయ విద్యలోరాణించేలా.. సంగారెడ్డి న్యాయ కళాశాల.. ఉచిత వసతి సౌకర్యం కుడా

#Tags