Study In USA After 12th: అమెరికాలో హైస్కూల్ స్టడీ ఎలా ఉంటుంది? ఎలాంటి కోర్సులు తీసుకుంటే మంచిది?
అమెరికాలో హైస్కూల్ విద్యా విధానం భారత్‌తో పోలిస్తే ఎలా ఉంటుంది? SAT or ACT or AP.. వీటిలో కష్టమైన కోర్సులు ఏంటి?AP తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
1. అమెరికాలో హైస్కూల్ స్టడీ ఎలా ఉంటుంది?
జ: అమెరికాలో 9-12వ తరగతిని హైస్కూల్ అని పిలుస్తారు. భారత్‌లో పదో తరగతి తర్వాత ఎంపీసీ, బైపీసీ సహా ఇతర కోర్సులను చేసే అవకాశం ఉంటుంది. కానీ అదే అమెరికాలో అయితే హైస్కూల్ చదువుతున్నప్పుడే కాలేజీ కోర్సులను తీసుకునే అవకాశం ఉంటుంది.
2. అక్కడి హైస్కూల్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి?
జ: సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్,AP, అమెరికన్ హిస్టరీ, హానర్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్ట్స్ ఉంటాయి.
3. హైస్కూల్‌లో ఎలాంటి కోర్సులు ఉంటాయి?
జ: ఇందులో ప్రధానంగా మూడు రకాల కోర్సులు ఉంటాయి.
లెవల్-1లో నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
లెవల్-2లో హానర్స్ ఉంటుంది.
లెవల్-3లో AP ఉంటుంది. ఇది అడ్వాన్స్ లెవల్‌లో ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇవన్నీ కాలేజీలకు సంబంధించిన క్లాసులు. కానీ మన ఆసక్తిని బట్టి హైస్కూల్‌లోనే తీసుకోవచ్చు.
4. అన్నింటి కంటే కఠినతరమైన AP తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది?
జ: ప్రతి సబ్జెక్ట్స్‌కి స్కోర్స్ ఇస్తారు. మీరు హైస్కూల్ అనంతరం ఈ స్కోర్ ఆధారంగా కాలేజీల్లో అడ్మీషన్ పొందవచ్చు. హైస్కూల్‌లోనే తీసుకునే కోర్సులను మళ్లీ కాలేజ్‌లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
5. మిగతా కోర్సుల కంటే AP తీసుకోవడం వల్ల ఎన్ని క్రెడిట్స్ వస్తాయి?
జ: మీరు రెగ్యులర్ కోర్సులు తీసుకుంటే వచ్చే క్రెడిట్స్ కంటే AP కోర్సులు ఎంచుకుంటే ఎక్కువ క్రెడిట్స్ వస్తాయి.
6. హైస్కూల్ అంటే 9-12వ తరగతి వరకు ఉంటుంది కదా. 9వ తరగతిలో ఎన్ని AP క్లాసులు తీసుకోవచ్చు? ఎక్కువ తీసుకుంటే తర్వాత ఉపయోగంగా ఉంటుందా?
జ: 9వ తరగతికి 2 APలు తీసుకోవచ్చు. 10వ తరగతికి వచ్చేసరికి 3-5 తీసుకోవచ్చు. అయితే ఎక్కువ కోర్సులు తీసుకోవడం వల్ల అకడమిక్స్, ఆ తర్వాత క్రీడలు అన్నింటిని బ్యాలెన్స్ చేయడం సాధ్యపడదు. AP కోర్సు అంటే కాలేజీ లెవల్‌కి సంబంధించినవి. కాబట్టి మీ కెపాసిటీకి తగ్గట్లు APలు తీసుకోవాలి.
7. ఏ సబ్జెక్ట్స్‌లో AP క్లాసులు తీసుకుంటే మంచిది?
జ: అది మీ ఇంట్రెస్ట్‌ని బట్టి తీసుకోవాలి. మీకు మ్యాథ్స్ ఇష్టమైతే దానికి తగ్గట్లుగా ఉన్న AP క్లాసులను ఎంచుకోవాలి.
8. అమెరికన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ SAT, ACT ?AP అంటే ఏంటి?
జ: సింపుల్‌గా చెప్పాలంటే.. SAT, ACT అనేవి ఎంసెట్ లాంటివి. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు. వీటి స్కోర్ ఆధారంగానే కాలేజీల్లో ప్రవేశం కల్పిస్తారు. కానీ ఏపీ చాలా అడ్వాన్స్‌డ్ ఉంటుంది. SAT or ACT ఎగ్జామ్స్‌కి ఏపీ అవసరం లేదు. అది కాలేజీల్లో కోర్సులను ఎంచుకోవడానికి తీసుకోవాల్సి ఉంటుంది.
9. SAT or ACT.. రెండింట్లో ఏది కష్టంగా ఉంటుంది?
జ: మీకు మ్యాథ్స్‌లో బెటర్ అనుకుంటే SATతీసుకోండి. లేదంటే ACT తీసుకోవచ్చు.
10. SAT or ACT.. ఎప్పుడు తీసుకోవాల్సా ఉంటుంది? వీటికి కోచింగ్ తప్పనిసరా?
జ: టెన్త్ తర్వాత 12కి ముందు తీసుకోవచ్చు. ఒక ఏడాదికి పరిమిత సంఖ్యలోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక కోచింగ్ అనేది మీ సొంత నిర్ణయం. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో యూట్యూబ్, ప్రాక్టీస్ టెస్టులు వంటి ఆన్‌లైన్ కోర్సుల ద్వారా క్రాక్ చేయడం సులభమే.