Sports Competition: విద్యార్థుల గేమ్స్ పోటీల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో పాఠ‌శాల విద్యార్థుల‌కు ఆట‌ల పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు షెడ్యూల్ విడుద‌ల చేసారు. ఈ పోటీల తేదీలు, మ‌రిన్ని వివ‌రాల‌ను గేమ్స్ సెక్ర‌ట‌రీ వ‌న‌జ ప్ర‌క‌టించారు.
Different levels sports competitions for school students

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీలకు సంబంధించి డీఈఓ వీఎస్‌ సుబ్బారావు ఆదేశాల మేరకు షెడ్యూల్‌ విడుదల చేసినట్లు స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ వనజ తెలిపారు. మండల స్థాయిలో అండర్‌–14 విభాగంలో బాలబాలికలకు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు, నియోజకవర్గ స్థాయిలో ఈనెల 14, 20, 21, 22వ తేదీల్లో, అలాగే జిల్లా స్థాయిలో ఈనెల 16 నుంచి 30 తేదీ వరకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు సెప్టెంబర్‌ మూడో వారంలో నిర్వహించనున్నట్లు ఏపీఎస్‌జీఎఫ్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి పోటీలు సెప్టెంబర్‌ 14వ తేదీ నిర్వహించాలని స్పష్టం చేశారు.

Physical Exam for SI posts: పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్‌లో దేహ‌దారుఢ్య ప‌రీక్ష‌లు


మండల స్థాయిలో ఎస్‌జీఎఫ్‌ కోఆర్డినేటర్‌ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్‌, త్రోబాల్‌, వాలీబాల్‌, యోగా క్రీడాంశాల్లో టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిలోనూ అవే 9 అంశాలపై ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు తమ విద్యార్థులు ఏయే క్రీడల్లో, ఏ కేటగిరీలో పాల్గొంటారనే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఆఫ్‌లైన్‌ ఎంట్రీ ఫాంలను టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌ టీమ్‌కు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఏ పాఠశాలలో అయితే సెలక్షన్స్‌ నిర్వహిస్తారో ఆ పాఠశాలలోనే మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు ఆయా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సమర్పించాలని కోరారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నేరుగా జిల్లా స్థాయి సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రొత్సహించి పోటీలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ITI Admission 2023-24: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థులను ప్రోత్సహించి పోటీలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ వనజ విజ్ఞప్తి..

#Tags