NCC క్యాడెట్లకు శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా!
Sakshi Education
1949లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌సీసీ స్థాపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టివోలీ థియేటర్ సమీపంలో రాష్ట్ర ఏన్‌సీసీ డైరెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 1962లో ఎయిర్ కమోడోర్‌ను డైరెక్టర్‌గా నియమించారు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్–4 గ్రూపులు, ఆంధ్రలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం 5 గ్రూపులు ఉన్నాయి. 9 గ్రూపుల్లో జూనియర్, సీనియర్ వింగ్‌లలో లక్షా నలభై వేల మందికి పైగా క్యాడెట్లు ఉన్నారు.
NCC క్యాడెట్లకు వివిధ అంశాల్లో శిక్షణ
తొమ్మిది గ్రూపుల పరిధిలోని వివిధ బెటాలియన్లు, పాఠశాల, కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ లేదా బాటిల్ క్రాఫ్ట్, ఫైరింగ్‌తో పాటు క్రమశిక్షణ, యోగా, నాయకత్వ లక్షణాలు, మార్చింగ్ డ్రిల్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విషయాలపై నిపుణులతో ఉపన్యాసాలు, క్రీడా పోటీలు, వ్యర్థాలను రిసైక్లింగ్ చేసే పద్ధతులు, కెరీర్ కౌన్సిలింగ్‌తో పాటు సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ భారత్, రక్తదానం, వివిధ అంశాలపై అవగాహన ర్యాలీలు తదితర వాటిల్లో క్యాడెట్లకు తర్ఫీదు అందజేస్తారు.
Also read: 78th Independence Day: దేశసేవకు మేముసైతం
Published date : 15 Aug 2024 12:16PM