ఐక్యత, క్రమశిక్షణకు మారుపేరు NCC
ఆలిండియా ఎన్‌సీసీ ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్‌లో ప్రతిభ చూపిన కళాశాలకు చెందిన కేడెట్లను అక్టోబర్ 27న ఆమె అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేడెట్లు తుల్జారామ్, వేణు, తిరుపతి ఇటీవల ఏపీలోని అరుకు వ్యాలీలో 8రోజుల పాటు నిర్వహించిన ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ కేర్‌టేకర్ కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, పరీక్షల నియంత్రాణాధికారి డా.గోపాల సుదర్శనం, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డా.సీహెచ్ మధుసూదన్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: NCC.. దేశ సేవకు మేము సైతం..! ఎన్‌సీసీ క్యాడెట్ల సర్టిఫికెట్ A, B, C ప్రయోజనాలు ఇవే..
రాష్ట్ర స్థాయికి విద్యార్థుల ఎంపిక
అదే విధంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు సమద్, శివగణేశ్, స్వామిచరణ్ ఎస్‌జీఎఫ్ అండర్ –19 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో సంగారెడ్డిలో జరగనున్న పోటీల్లో వారు పాల్గొంటారని ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా వారిని ఎస్‌ఈజీఎఫ్ జిల్లా సెక్రెటరీ మంతెన సమ్మయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా స్పోర్ట్స్ ఇన్‌చార్జి వెంకటేశ్, కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జి అశోక్, అధ్యాపకులు కనకచంద్రం, శ్రీనివాస్‌రెడ్డి, నగేశ్, వెంకటరమణ, రఘురాజ్, గంగాధర్ తదితరులు అభినందించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |