Skip to main content

78th Independence Day: దేశసేవకు మేముసైతం

నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌(ఎన్‌సీసీ) అనేది జాతీయ యువజన విభాగం. ఇది ఒక స్వచ్ఛంద ప్రాతిపదికన ఏర్పాటు చేసిన సంస్థ. ఇది భారత సాయుధ దళాల అంతర్భాగం.
78th Independence Day  Ncc training session national youth wing
78th Independence Day

దేశంలోని యువతను క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది పాఠశాల స్థాయిలో మొదలై డిగ్రీ విద్యార్థులను కేడెట్స్‌గా సెలెక్ట్‌ చేసుకొని శిక్షణ అందిస్తారు. వీరికి డ్రిల్, ఆయుధాల వినియోగం తదితర వాటిపై శిక్షణ ఇచ్చి ఏ, బీ, సీ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌వింగ్‌లో ఎన్‌సీసీ పూర్తి చేసిన వారికి రిజర్వేషన్‌ కలి్పస్తారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని దేశసేవకు మేముసైతం అంటున్న ఎన్‌సీసీ క్యాడెట్లపై సాక్షి ప్రత్యేక కథనం..  

తెలంగాణ, ఏపీ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌లో 9 గ్రూపులు 

స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాల, కళాశాలల విద్యార్థులకు సైన్యం, నావిక దళం, ఎయిర్‌ఫోర్స్‌ ట్రై సరీ్వసెస్‌లో శిక్షణ అందజేయడం కోసం ఏర్పడిన భారత సాయుధ దళాల యువ విభాగం నేషనల్‌ క్యాడేట్‌ కార్ప్స్‌(ఎన్‌సీసీ). మన భారత దేశ సైన్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసే లక్ష్యంతో భారత రక్షణ చట్టం ప్రకారం 1948లో ఎన్‌సీసీ ఏర్పాటైంది. 1949లో బాలికల విభాగం, 1950లో ఎయిర్‌వింగ్, 1952లో నేవీ వింగ్‌ ఏర్పడ్డాయి. 1962 చైనా– ఇండియా యుద్ధం తర్వాత దేశం అవసరాన్ని తీర్చడానికి 1963లో ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆయుధాల్లో, డ్రిల్‌ తదితర అంశాల్లో శిక్షణ తప్పనిసరి చేశారు.  

Also read: 

1949లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌సీసీ స్థాపించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టివోలీ థియేటర్‌ సమీపంలో రాష్ట్ర ఏన్‌సీసీ డైరెక్టరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. 1962లో ఎయిర్‌ కమోడోర్‌ను డైరెక్టర్‌గా నియమించారు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్‌ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్‌–4 గ్రూపులు, ఆంధ్రలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం 5 గ్రూపులు ఉన్నాయి. 9 గ్రూపుల్లో జూనియర్, సీనియర్‌ వింగ్‌లలో లక్షా నలభై వేల మందికి పైగా క్యాడెట్లు ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా ఎయిర్‌ కమోడోర్‌ వీఎం.రెడ్డి ఉన్నారు.

Also read: 

Published date : 15 Aug 2024 12:09PM

Photo Stories